నాగశౌర్యతో ఛలో సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక అదిరిపోయే.. అద్భుతమైన సక్సెస్ లు అందుకొని గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. గీత గోవిందం, స‌రిలేరు నీకెవ్వరు, భీష్మ ఇలా తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది అంటే నమ్మండి.. సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వరూ సినిమాతో మీకు అర్ధం అవుతుందా? అంటూ అల్లరి చేసిన రష్మిక.. ప్రస్తుతం భీష్మ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. 

 

అలాంటి ఈ ముద్దుగుమ్మకు చెల్లి ఉంది అని మీకు ఎవరికైనా తెలుసా? ఆ చెల్లి ఎంత అందంగా ఉందో తెలుసా? నిజానికి రష్మిక కంటే కూడా రష్మిక చెల్లె అందంగా ఉంది. అయితే రష్మిక చెల్లికి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అంట. సరే ఇవి అన్ని పక్కన పెడుదాం.. రష్మిక చెల్లి వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 

 

రష్మిక కంటే రెండు లేదా మూడేళ్లు చిన్నది అనుకుంటున్నారు కదా! అలా అనుకుంటే మీరు పప్పులోకి కాలు వేసినట్టే.. రష్మిక వయసు 24 ఏళ్లు..  అయితే రష్మిక కంటే తన చెల్లి 18 ఏళ్లు చిన్నాది. ఈ చిట్టి చెల్లి వయసు ఆరేళ్ళు. రష్మిక మందన చిట్టి చెల్లి పేరు శిమన్ మందన. ప్రస్తుతం రష్మికతో దిగిన తన చిట్టి చెల్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

కొందరు.. జూనియర్ ఫ్యాన్ తో రష్మిక అని కామెంట్లు పెడితే.. ఆమె స్పందిస్తూ.. ఆమె నా చెల్లి బాబు.. ఫ్యాన్ కాదు అంటూ కామెంట్లు చేస్తోంది.. ఈ ఫోటోలు చుసిన మరికొందరు నెటిజన్లు కూడా.. నీకు ఇంత చిన్న చెల్లి ఉందా? అంటూ షాక్ అయిపోతున్నారు. ఏది ఏమైనా రష్మికకు చెల్లి ఉంటుంది అని ఎవరు ఊహించలేదు.. ఒకవేళ ఉహించినప్పటికీ ర‌ష్మిక‌కు మరి ఇంత చిన్న చెల్లి ఉంటుంది అని అస్సలు అనుకుని ఉండరు.. ఏది ఏమైనా ఇప్పుడు రష్మిక చెల్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: