ప్రతి ఏడాది వందల కొద్ది సినిమాలు రిలీజ్ అవుతాయి.. వాటిలో ప్రేక్షకులు మెచ్చే సినిమాలు.. కమర్షియల్ గా సక్సెస్ అయ్యే సినిమాలు చాలా తక్కువ. వంద సినిమాలు రిలీజైతె అందులో 20 శాతం సినిమాలు కూడా సూపర్ హిట్ అనిపించుకోవడం లేదు. కథ, కథనాలే కాదు ఆ పాత్రలకు తగినట్టుగా ఆర్టిస్టుల ఎంపిక కూడా సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ నెలలో లో బడ్జెట్ సినిమాల నుండి మీడియం బడ్జెట్ సినిమాల వరకు దాదాపుగా 16 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాల్లో డెబ్యూ హీరోలు నటించిన సినిమాలు కొన్నైతే స్టార్స్ నటించిన సినిమాలు ఉన్నాయి.

 

ఫిబ్రవరి నెలలో హెరాల్డ్ బెస్ట్ అవార్డ్ పోటీల్లో భీష్మ సినిమా నుండి జిసు సేన్ గుప్తా ది బెస్ట్ అనిపించుకున్నారు. జనవరి చివరన వచ్చిన నాగ శౌర్య అశ్వద్ధామ సినిమాలో కూడా తన విలనిజంతో మెప్పించిన జిస్సు సేన్ గుప్తా.. నితిన్ భీష్మ సినిమాలో స్టైలిష్ విలన్ గా మెప్పించాడు. ఈ నెలలో రిలీజైన అన్ని సినిమాల విలన్స్ తో పోల్చితే జిసు సేన్ గుప్తా కు హెరాల్డ్ బెస్ట్ విలన్ అవార్డ్ అందుకున్నారు.  

 

బాలీవుడ్ నుండి వచ్చిన జిసు సేన్ గుప్తా తెలుగులో మంచి ఫ్యూచర్ ఉండేలా తన నటనతో ఆకట్టుకుంటున్నారు. హెరాల్డ్ ప్రతి నెల ఇచ్చే అవార్డుల్లో ఫస్ట్ టైం విలన్ గా జిస్సు సేన్ గుప్తా అవార్డ్ అందుకోవడం విశేషం. ఇలానే తన పర్ఫార్మెన్స్ తో మరిన్ని తెలుగు సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలని.. తెలుగులో ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని ఆశిద్దాం. హెరాల్డ్ ఫిబ్రవరి బెస్ట్ విలన్ అవార్డ్ అందుకున్న జిసు సేన్ గుప్తాకి కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెబుతుంది ఇండియాహెరాల్డ్.కామ్ టీమ్.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: