ఒక సినిమా హిట్ అవడానికి సినిమాలో అన్ని సరిగ్గా కుదరాలని అంటారు. ఈ నెల సూపర్ ఫన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలచిన నితిన్ భీష్మ సినిమాకు ఇవన్ని కుదిరాయి. వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నితిన్, రష్మిక జంటగా నటించారు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో డ్యాన్స్ నంబర్ గా వచ్చిన సాంగ్ వాటే బ్యూటీ. భీష్మ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే ఈ సాంగ్ అదిరిపోతుంది. ఊపొచ్చే ఈ సాంగ్ ను అంతే ఊపొచ్చేలా డ్యాన్స్ కంపోజ్ చేశాడు జాని మాస్టర్.

 

ముఖ్యంగా కొన్నాళ్లుగా సరైన స్టెప్పులేయక వెనుకపడ్డ నితిన్ మళ్లీ ఈ పాటలో తన సత్తా చాటాడు. హీరో నితిన్ కు ఏమాత్రం తక్కువ తీసిపోని విధంగా రష్మిక కూడా ఈ పాటలో అదరగొట్టింది. జాని మాస్టర్ కంపోజింగ్ అంటే సాంగ్ సూపర్ హిట్ అన్నట్టే. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న శేఖర్ మాస్టర్, జాని మాస్టర్ ఇద్దరిలో ఈ నెల బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జాని మాస్టర్ అవార్డ్ అందుకుంటున్నారు. భీష్మ సినిమాలో క్లైమాక్స్ లో ఈ సాంగ్ ఫుల్ ఎనర్జీని ఇస్తుంది.

 

కొరియోగ్రాఫర్ గా తన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తున్న జాని మాస్టర్ రాం చరణ్, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవికి కూడా డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నారు. నితిన్ తో కూడా ఇదివరకు పనిచేసినా భీష్మ సినిమాలోని వాటే బ్యూటీ సాంగ్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది. భీష్మ ఆలబం లో సూపర్ హిట్ పాటగానే కాదు కంపోజింగ్ లో కూడా సూపర్ అనిపించుకున్న వాటే బ్యూటీ సాంగ్ తో జాని మాస్టర్ కు హెరాల్డ్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ వచ్చింది. ఇలానే ఆయన కంపోజింగ్ లో స్టార్స్ తో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటూ ఇండియాహెరాల్డ్.కాం టీం నుండి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: