సినిమాకు మంచి కథ, కథనాలు ఎంత అవసరమో దాన్ని ఆడియెన్స్ కు చేరవేసేలా చేసే టెక్నికల్ ఎఫర్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి అన్ని బాగా కుదిరినా ఏదో ఒక విషయంలో తేడా కొట్టేస్తుంది. ఎంత బడ్జెట్ సినిమా అయినా.. ఎంతమంది స్టార్స్ నటించిన సినిమా అయినా ఎడిటర్ టేబుల్ దగ్గరకు రావాల్సిందే. ఆయన కత్తెరలు వేయాల్సిందే. నాలుగైదు గంటల రష్ ను మనకు రెండున్నర గంటల్లో చేసి మెప్పించేలా చేయడమే ఎడిటర్ పని.

 

డైరక్టర్ కన్నా టఫ్ అయ్యిన జాబ్ ఇది.. అందుకే కొన్ని సినిమాలు ఎడిటింగ్ లోపం వల్ల ఫెయిల్ అయినట్టు కూడా చెప్పుకుంటారు. కేవలం దర్శకుడు మాత్రమే కాదు ఎడిటర్ కూడా తన క్రియేటివిటీతో సినిమాను ఎడిట్ చేస్తాడు. ఇక ఫిబ్రవరి నెలలో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ ఎడిటర్ గా అవార్డ్ అందుకుంటున్నారు గ్యారీ. నాని నిర్మాతగా విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమాకు షార్ప్ ఎడిటింగ్ తో అందరి మెప్పు పొందాడు గ్యారీ. శైలేష్ డైరక్షన్ లో వచ్చిన హిట్ సినిమాకు గ్యారీ ఎడిటింగ్ చాలా ప్రాధాన్యత వహించిందని చెప్పొచ్చు.

 

హిట్ సినిమాలో అతని ఎడిటింగ్ చాలా క్లవర్ గా ఉంది. ఈ నెల బెస్ట్ ఎడిటర్ అవార్డుల్లో భీష్మ నవీన్ నూలి, హిట్ గ్యారీ పోటీ పడ్డారు. అయితే ఇద్దరిలో గ్యారీకి ఎక్కువ మార్కులు పడ్డాయి. హిట్ సినిమాలో దర్శకుడి విజన్ ను ఎడిటింగ్ లో కూడా కనిపించేలా చేశాడు గ్యారీ. ఇండియా హెరాల్డ్ ఫిబ్రవరి ది బెస్ట్ ఎడిటర్ గా అవార్డ్ అందుకుంటున్న గ్యారీ ఇలానే మంచి మంచి ప్రాజెక్ట్ చేసి గొప్ప ఎడిటర్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఆశిద్దాం. హిట్ సినిమాకు హెరాల్డ్ టీం ఇస్తున్న ఈ అవార్డ్ కు ఆయన పూర్తి అర్హుడని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: