పవన్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కు కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ లోగో ను మార్చి 2న విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడ భారీగా నిర్వహించి ఈ మూవీకి మ్యానియా తీసుకు రావాలని దిల్ రాజ్సినిమా విడుదలకు 60 రోజులు ముందుగానే వ్యూహాలు ప్రారంభిస్తున్నాడు. 


ఇప్పటికే ఈ సినిమాకు ‘అల వైకుంఠపురములో’ స్థాయిలో మ్యానియా తీసుకు రావాలి అని ప్రయత్నిస్తున్న దిల్ రాజ్ ఆ మూవీలోని ‘సామజవరగమన’ స్థాయిలో తమన్ సిద్ శ్రీరామ్ సిరివెన్నెల కాంబినేషన్ లో స్వరపరచిన పాటను ఈనెల 8వ తారీఖున విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలోని పాటలు విషయంలో కూడ తమన్ చాల శ్రద్ధ తీసుకుంటూ ఆడియోను క్లిక్ చేయాలి అన్న పట్టుదలతో ఉన్నాడు.


ఇది ఇలా ఉండగా ఈ మూవీ షూటింగ్ అప్పుడే సగం పైగా పూర్తి అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు కీలకమైన కోర్టు సీన్ షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉందని ఆ సీన్ చిత్రీకరణ పూర్తి అయితే ఈ మూవీ షూటింగ్ ఇంచుమించు పూర్తి అయినట్లే అని అంటున్నారు. 


ఈ సినిమాకు సంబంధించిన ఒరిజినల్ మాతృక ‘పింక్’ మూవీతో సంబంధం లేకుండా చాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ రీమేక్ లో పెట్టడమే కాకుండా పవన్ భావజాలానికి అనుగుణంగా సంభాషణలలో అనేక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో పవన్ లాయర్ పాత్ర విపరీతమైన ఇగో ఉండే పాత్రగా డిజైన్ చేయడంతో ఆ పాత్ర పవన్ తిక్క స్వభావానికి పూర్తిగా సరిపోయే విధంగా కనిపిస్తూ పవన్ అభిమానులకు వెంటనే కనెక్ట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ దిల్ రాజ్ అంచనాలకు అనుగుణంగా జరగని నేపధ్యంలో మార్చి 2 నుంచి ప్రారంభం కాబోయే పవన్ ‘వకీల్ సాబ్ మ్యానియా ఎంత వరకు దిల్ రాజ్ ను గట్టెక్కిస్తుందో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: