ఫిబ్రవరి నెలలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ మ్యూజిక్ అందించిన సినిమా భీష్మ అని చెప్పొచ్చు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ అదరగొట్టాయి. ఈ ఆల్బం లో వాటే బ్యూటీ సాంగ్ డ్యాన్సింగ్ నంబర్ కాగా ప్రేక్షకులందరిని మెప్పించిన పాట సరాసరి గుండెల్లో దించావే. మణిశర్మ మార్క్ మెలోడీని మిక్స్ చేసి ఆయన తనయుడు అందించిన భీష్మలోని ఈ సాంగ్ హెరాల్డ్ బెస్ట్ సాంగ్ ఫిబ్రవరి 2020 అవార్డ్ అందుకుంటుంది.

 

శ్రీమణి రచించిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి పాడటం విశేషం. హీరోయిన్ గురించి హీరో ఊహించుకుంటూ పాడుకునే ఈ పాట మ్యూజిక్ కంపోజింగ్ ఎంత అందంగా ఉందో పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. నితిన్, రష్మికల మధ్య కెమిస్ట్రీ కూడా ఈ సాంగ్ లో చాలా బాగుంటుంది. సినిమాలో కూడా ఈ ఇద్దరి మధ్య సన్నివేశాలు అలరించాయి. వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన భీష్మ సినిమా మ్యూజిక్ పరంగా కూడా ది బెస్ట్ అనిపించుకుంది. హెరాల్డ్ బెస్ట్ సాంగ్ కేటగిరిలో జాను నుండి ఊహలే ఊహలే.. భెష్మ నుండి సరాసరి సాంగ్స్ పోటీ పడ్డాయి.

 

అయితే జాను కమర్షియల్ గా కూడా ఫెయిల్ అయ్యింది. భీష్మ ఇప్పటికి మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. అంతేకాదు భీష్మలోని సరాసరి సాంగ్ శ్రోతలను ఎంతగానో అలరిస్తుంది. హెరాల్డ్ బెస్ట్ సాంగ్ అవార్డ్ అందుకున్న సరాసరి కంపోజర్ మహతి స్వర సాగర్.. సింగర్ అనురాగ్ కులకర్ణి.. ఇంత మంచి పాటని రాసిన శ్రీమణికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఇలాంటి మంచి సాంగ్స్ మరెన్నో రావాలని కోరుకుంటుంది ఇండియాహెరాల్డ్.కామ్ టీమ్. యూట్యూబ్ లో కూడా ఈ సాంగ్ మంచి వ్యూస్ సాధిస్తుంది. నితిన్ కెరియర్ లో డి బెస్ట్ ఆల్బం భీష్మ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: