ప్రపంచాన్ని చిగురుటాకులా గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే 57 దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ తో ఇప్పటికే వేలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలి పోతోంది. నిన్న ఒక్కరోజు స్టాక్ మార్కెట్ పతనంతో 5.45 కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. ఏ క్షణమైనా ఈ వైరస్ ప్రభావం భారత్ పై కనిపిస్తుంది అన్న హెచ్చరికలు వస్తున్న నేపధ్యంలో భారతీయులు అంతా హడలిపోతున్నారు.


కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా విమాన రంగం టూరిజం రంగాలతో పాటు అనేక పరిశ్రమలు కూడ పూర్తిగా కుదేలు అయిపోతున్న నేపధ్యంలో మన రూపాయి విలువ 6 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ స్థితి ఇలాగే కొనసాగితే మన భారత్ కు ఆర్ధిక కష్టాలు తప్పవు అని అంటున్నారు. ఈ వైరస్ ప్రభావం మన దేశానికి కూడ సోకితే ఆసియా ఖండం లో మురికి వాడలు ఎక్కువగా ఉండే భారత్ కు పెను ప్రమాదం ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరికలు చేస్తోంది.


ఇలాంటి విపత్కర పరిస్థితులలో యంగ్ హీరో నిఖిల్ కరోనా వైరస్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ‘థాంక్స్ కరోనా వైరస్ ఎక్కువ షేర్లు కొనుక్కోవడానికి ఇదే సరైన సమయం’ అంటూ చేసిన ట్విట్ వైరల్ గా మారింది. ఈ ట్విట్ ను చూసి కొందరు సరదాగా నవ్వుకుంటే మరికొందరు నిఖిల్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


ప్రపంచం సర్వనాశనం అయిపోతుంటే నిఖిల్ కు ఆనందంగా ఉందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ‘అర్జున్ సురవరం’ మూవీ అనుకున్న స్థాయిలో విజయవంతం అవ్వకపోవడంతో నిరాశలో ఉన్న నిఖిల్ కు ఈ అనుకోని విమర్శల దాడి చూసి షాక్ అవుతున్నాడు. ఏది ఏమైనా నిఖిల్ కు ప్రస్తుత కాలం కలిసి వస్తున్నట్లు అనిపించడం లేదు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: