మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 152వ సినిమాపై రోజు రోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. టైటిల్ నుంచి హీరోయిన్ వరకూ ప్రతీది హైలైట్ అవుతూనే ఉంది. కీలకపాత్రల్లో ఎవరెవరు నటిస్తున్నారు.. కథ ఎలా ఉండబోతోందనే ఊహాగానాలు అభిమానులను నిలువనీయడం లేదు. ఇందుకు రీసెంట్ గా లీక్ అయిన చిరంజీవి లుక్ మరింత ఆజ్యం పోసిందనే చెప్పాలి. సినిమాపై పెరుగుతున్న అంచనాల్లో మరింత ముఖ్యమైంది.. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్నాడా లేదా.. అనేది.

 

దీనిపై ఇంకా అఫిషియల్ కన్ఫర్మేషన్ రాకపోయినప్పటికీ ఇటు మెగాభిమానుల్లోనూ, అటు మహేశ్ అభిమానుల్లోనూ అంచనాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఉత్సాహం ఆపుకోలేక పోస్టర్స్ డిజైన్ చేసేస్తున్నారు. ప్రస్తుతం అలా చేసి ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. టైటిల్ ను కూడా వారే డిసైడ్ చేసేసి డిజైన్ చేసి వదిలారు. పోస్టర్ లో మెగాస్టార్, సూపర్ స్టార్ ఇద్దరినీ షాడో లుక్ లో వెనుక షాట్ నుంచి లైట్ ఫోకస్ చేస్తూ డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఆచార్య అనే టైటిల్ ను కూడా స్టైలిష్ గా డిజైన్ చేశారు. సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ అద్దం పడుతోంది.

IHG

 

అయితే.. వీటన్నింటిపై ఇప్పటికీ పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. మహేశ్ నటిస్తున్నాడా లేదా.. టైటిల్ ఆచార్యేనా.. హీరోయిన్ త్రిష కన్ఫర్మ్ అయిందా.. ఇలా వీటన్నింటిపైనా ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య మహేశ్ కు హీరోయిన్ గా పూజా హేగ్డే అంటూ కూడా వార్తలు వచ్చేస్తున్నాయి. దీనిపై కొణిదెల ప్రొడక్షన్స్ గానీ, మహేశ్ గానీ క్లారిటీ ఇవ్వాల్సిందే. మరి ఈ గాసిప్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతాయో చూడాలి.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: