తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలతో స్టార్ హీరోలు ఓ పక్క సంచలనాలకు సిద్ధమవుతున్నా సగటు ప్రేక్షకుడిని మెప్పించడానికి యువ హీరోలు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇక వారి బాటలోనే కొత్తగా టాలెంటెడ్ ఆర్టిస్టులు తమ సత్తా చాటుతున్నారు. ఫిబ్రవరి నెలలో రిలీజైన మొత్తం 16 సినిమాల్లో 7 సినిమాలు కొత్త వారు తీసినవే. వారిలో ప్రెజర్ కుక్కర్ హీరో సాయి రోనక్ ఒకరు. అమెరికా పంపించాలనే తండ్రి కోరికని నెరవేర్చలేని ఓ కొడుకు.. జీవితంలో ఎదగాలంటే అమెరికాకు వెళ్లడం కాదని చెప్పిన సినిమా ప్రెజర్ కుక్కర్.

 

ఈ సినిమాలో హీరోగా సాయి రోనక్ నటన ఇంప్రెస్ చేస్తుంది. హీరోగా సాయి రోనక్ తన బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. సినిమాలో తన పాత్రకు తగినట్టుగా అభినయంతో మెప్పించాడు సాయి రోనక్. పాఠశాల, గుప్పెడంత ప్రేమ, లంక, కడలి సినిమాల్లో నటించిన సాయి రోనక్ ప్రెజర్ కుక్కర్ లో మాత్రం యాక్టర్ గా ఓ మంచి ఐడెంటిటీ కోసం ప్రయత్నించాడని చెప్పొచ్చు. సినిమాకు ఆడియెన్స్ లో అంతగా రాకున్నా చూసిన వారు మాత్రం ఫీల్ గుడ్ మూవీ అంటూ రెస్పాన్స్ తెలియచేశారు.

 

టాలెంట్ ఉన్న వారికి ఈమధ్య మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఐదారేళ్లుగా ఐడెంటిటీ లేని పాత్రలు చేసిన సాయి రోనక్ ప్రెజర్ కుక్కర్ లో హీరోగా మెప్పించాడు. హెరాల్డ్ ఫిబ్రవరి డెబ్యూ హీరో అవార్డ్ కోసం సాయి రోనక్ ను సెలెక్ట్ చేయడం విశేషం. తనలో ఉన్న ఈ తపన ఇంకా పెరిగి ప్రేక్షకాదరణ పొందే సినిమాలు చేయాలని ఇండియాహెరాల్డ్ టీం కోరుకుంటుంది. హెరాల్డ్ ఫిబ్రవరి డెబ్యూ హీరో అవార్డ్ అందుకున్న సాయి రోనక్ ఇలాంటి సినిమాలు మరెన్నో చేసి కెరియర్ లో పెద్ద స్థాయికి చేరుకోవాలని ఆశిద్దాం.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: