బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచి భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన పేజీకి క్రియేట్ చేసిన ఈ దర్శకుడు మరో సారి ఆ చరిత్రని తిరగరాయడానికి సిద్ధం అవుతున్నాడు. బాహుబలి సినిమా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాన్ని మించే సినిమా రాలేదు. ఎందరో దర్శకులు బాహుబలిని మించేద్దామన్న ఉద్దేశ్యంతో సినిమాలు చేసినప్పటికీ ఒక్కరు కూడా సక్సెస్ కాలేకపోయారు.

 

 


తను లిఖించిన రికార్డుని తనే బద్దలు కొట్టేందుకు ఆర్.ఆర్.ఆర్ తో వస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరంభీం గా కనిపిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజులాగా కనిపిస్తున్నారట. తెలుగుతో పాటు మొత్తం పది భాషల్లో ఈ చిత్రం విడుదల అవుతుందట.

 

 


ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ మొదలై సంవత్సరం కావొస్తున్నా సినిమా నుండి ఇంతవరకు ఎలాంటి అప్డేత్ రాలేదు. కనీసం టైటిల్ కూడా రివీల్ చేయలేదు. ఆర్.ఆర్.ఆర్ అనే అనధికార టైటిల్ తోనే పిలుస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ఫస్ట్ లుక్ విడుదల చేయాలని ఎంత గొడవ చేస్తున్నా చిత్ర బృందం మాత్రం సైలెంట్ గా ఉంటోంది. అయితే తాజాగా ఆర్.ఆర్.ఆర్  నుండి ఒక అప్డేట్ వచ్చింది.

 

 

ఆర్.ఆర్.ఆర్ అభిమాని అయిన ఒక నెటిజన్.. అప్డేట్ ని ఎప్పుడు వదులుతారని ప్రశ్నించగా, దానికి స్పందించిన ఆర్.ఆర్.ఆర్ టీమ్ మార్చిలో వదులుతామని తెలిపారు. మరి మార్చిలో ఇచ్చే ఆ అప్డేట్ ఏం అయ్యుంటుందని ఆలోచిస్తున్నారు. మార్చిలో రామ్ చరణ్ పుట్టినరోజు ఉంది కావున సినిమాలోని అతని లుక్ ని విడుదల చేస్తున్నారని అనుకుంటున్నారు. అదే నిజమైతే అభిమానులకి పండగే..

మరింత సమాచారం తెలుసుకోండి: