స్టార్ సినిమా అంటే కంటెంట్ తో పాటుగా కటౌట్ కు తగినట్టుగా యాక్షన్ సీన్స్ ఉండాల్సిందే. తమ హీరో విలన్లు రఫ్ఫాడించేస్తుంటే సీట్లలో కూర్చున్న్న అభిమానుల ఆనదానికి అవధులే ఉండవు. అందుకే స్టార్ సినిమాల్లో యాక్షన్ సీన్స్, ఫైట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమాలో అతని పాత్రని బట్టి స్టైలిష్ ఫైట్స్ కంపోజ్ చేస్తారు. అయితే తెలుగు సినిమా ఫైట్ మాస్టర్స్ విషయానికి వస్తే అయితే రామ్ లక్ష్మణ్ లేకపోతే విజయన్ ఆయన కాకపోతే పీటర్ హెయిన్స్ ఇవే పేర్లు వినిపిస్తాయి.

 

లేటెస్ట్ గా వెంకట్ ఫైట్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చాడు. భీష్మ సినిమాలో ఆయన చేసిన ఫైట్ కంపోజిషన్ సూపర్ అనిపించింది. లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న నితిన్ తోనే ఇలాంటి స్టైలిష్ ఫైట్ చేశాడు అంటే ఇక వెంకట్ కు స్టార్ అవకాశం వస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. హెరాల్డ్ ఫిబ్రవరి నెల బెస్ట్ ఫైట్ మాస్టర్ గా యునానిమస్ గా వెంకట్ కు ఇచ్చేయొచ్చు. ఈమధ్య చిన్న చిన్న సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేస్తున్న వెంకట్ భీష్మలో ఇలాంటి ఫైట్ కంపోజ్ చేచేయడంతో బాగా పాపులర్ అయ్యాడు. 

 

వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన ఛలో సినిమాలో కూడా అతను ఓ చిన్న ఫైట్ కంపోజ్ చేశాడు. అయితే ఆ సినిమాలో కన్నా భీష్మలో అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఫైట్ మాస్టర్ గా వెంకట్ కు మంచి ఫ్యూచర్ ఉంటుందని అనిపిస్తుంది. భీష్మలో అతని ఫైట్ కంపోజింగ్ నచ్చి లేటెస్ట్ గా ఓ స్టార్ సూపర్ ఛాన్స్ ఇచ్చాడని టాక్. అదే జరిగితే వెంకట్ ఫేట్ మారిపోయినట్టే. ఇలానే తను కంపోజ్ చేసిన ఫైట్స్ అవార్డులు తెచ్చుకోవాలని యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వెంకట్ కొత్త సంచలనాలు సృష్టించాలని ఆశిస్తూ ఇండియాహెరాల్డ్.కామ్ టీమ్ ఆల్ ది బెస్ట్ చెబుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: