దిల్ రాజ్ బిజినెస్ లో అత్యంత సన్నిహితంగా ఉండే లక్ష్మణ్ దిల్ రాజ్ వ్యాపారాల నుండి బయటకు వెళ్ళిపోయిన షాక్ నుండి తేరుకోకుండానే దిల్ రాజ్ కు మరో ఊహించని షాక్ తగిలినట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవితో చేస్తున్న ‘ఆచార్య’ మూవీని తనకు సన్నిహితంగా ఉండే డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే విధంగా వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్. 


ఈ విషయమై కొరటాల శివకు రామ్ చరణ్ పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ‘సైరా’ నష్టాలు వల్ల రామ్ చరణ్ కొంతమందికి వడ్డీలు కడుతున్నాడు అని గాసిప్పులు వస్తున్న పరిస్థితులలో చరణ్ ‘ఆచార్య’ మూవీ బడ్జెట్ కు సంబంధించి అదేవిధంగా మార్కెట్ కు సంబంధించి అన్ని విషయాలు కొరటాల కు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు తెలుస్తోంది. 


దీనితో కొరటాల తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులకు మాత్రమే ఆచార్య రైట్స్ అమ్ముతున్నాడని తెలుస్తోంది. అయితే దిల్ రాజ్ ఆచార్య రైట్స్ గురించి ఎంత ప్రయత్నించినా కొరటాల దిల్ రాజ్ వైపు చూడకుండా దిల్ రాజ్ మాజీ భాగస్వామి లక్ష్మణ్ వైపు అడుగులు వేయడంతో దిల్ రాజ్ కు కొరటాల కు గతంలో ఏమైనా అభిప్రాయభేదాలు ఉన్నాయా అన్న విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.


ఇది ఇలా ఉంటే కొరటాల వ్యూహాలు ఫలించి ‘ఆచార్య’ మూవీలో 40 నిముషాల ప్రత్యేక పాత్రకు మహేష్ ను ఎంపిక చేసే విషయంలో మార్గం సుగమం అయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో చరణ్ నటించవలసిన నక్సలైట్ పాత్ర మహేష్ ను దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్ లీడర్ గా మార్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మూవీ క్రేజ్ కోసం మహేష్ చిరంజీవిల పై ఒక పాటను క్రియేట్ చేసి ఈ మూవీ మ్యానియాను మరింత పెంచే ఆలోచనలో కొరటాల ఉన్నాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: