టాలీవుడ్‌లో ఫిబ్ర‌వ‌రి నెల సినిమాల్లో ఉత్త‌మ డైరెక్ట‌ర్ అవార్డు కోసం న‌లుగురు డైరెక్ట‌ర్లు ప్ర‌ధానంగా రేసులో ఉన్నారు. వీరిలో కోలీవుడ్ హిట్ మూవీ 96 సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కిన జానును తెర‌కెక్కించిన రైటర్ కమ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్.. ఇద్దరు ప్రేమికుల వాస్తవ జీవితాల్ని తెర మీద చూస్తున్న ఫీలింగ్ కలిగించాడు. ఈ సినిమాను యూత్‌కు క‌నెక్ట్ అయ్యేలా... వారి మ‌న‌స్సుల‌ను క‌దిలించేలా స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌డంలో ప్రేమ్‌కుమార్ ప‌డిన త‌ప‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్రేమ్‌కుమార్లో గొప్ప భావుక‌త కూడా ఉంది. ఇక స్లో నెరేష‌న్ ఈ సినిమాకు ప్ర‌ధాన మైన‌స్ అయితే.. అదే టైంలో తాను ఎంచుకున్న టార్గెట్ ఆడియెన్స్‌ను కూడా పూర్తిగా మెప్పించ‌లేదు. అయితే దర్శకత్వంలో లోపాలేమీ కనిపించవు.

 

ఇక వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ దర్శకుడు క్రాంతి మాధవ్ ను ఈ అవార్డు రేసు నుంచి ముందే ఎలిమినేట్ చేసేయాలి. ఎంతో సున్నిత‌మైన క‌థ‌ల‌తో మంచి సినిమాలు తెర‌కెక్కిస్తాడ‌ని పేరున్న క్రాంతి మాధ‌వ్ ఈ సారి వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ విష‌యంలో పూర్తిగా త‌డ‌బ‌డ్డాడు. నిర్మాత కేఎస్‌. రామారావు, హీరో విజ‌య్.. న‌లుగురు హీరోయిన్లు... ఇలా అన్ని వనరులూ సమకూరినా ఉపయోగించుకోలేకపోయాడు. విజయ్ లాంటి పెర్ఫామర్ ను అతను సరిగా ఉపయోగించుకోలేదు. ఇల్లెందు ట్రాక్ లో చూపించిన పనితనాన్ని అతను.. సినిమా అంతా చూపించి ఉంటే ఈ సినిమా ఖ‌చ్చితంగా ఓ క్లాసిక్ అయ్యేది.
ఇక ఈ సినిమా ఓ ద‌శ దాటాక క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా పూర్తిగా గాడి త‌ప్పేసింది.

 

ఇక భీష్మ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల ప్రేక్ష‌కుల‌ను వినోదంతో ఎలా మాయ చేయాలో బాగా నేర్చుకున్నాడు. తన గురువు త్రివిక్రమ్ స్టైల్లో భీష్మ‌ను చ‌క్క‌గా ప్ర‌జెంట్ చేశాడు. లాజిక్లు, గీజిక్‌ల‌తో ప‌ని లేకుండా సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యేలా చేశాడు. అతడి పెన్నులో పంచ్ పవర్ బాగుంది. డైలాగుల్లో మెరుపులు చాలానే ఉన్నాయి. ఈ తరంలో కామెడీని బాగా డీల్ చేయగల దర్శకుల్లో ఒకటిగా వెంకీ కనిపిస్తాడు. ఇక హిట్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ శైలేష్ కొల‌నుకు ఈ సినిమా తొలి సినిమా అయినా క్రైం జాన‌ర్ మీద మంచి ప‌ట్టున్న ద‌ర్శ‌కుడిలా ఈ సినిమా తీశాడు. తాను ఎంచుకున్న టార్గెట్ ఆడియెన్స్‌కు ఈ సినిమా రీచ్ అవుతుంది.

 

ఇక ఈ న‌లుగురు డైరెక్ట‌ర్ల‌లో జాను డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్‌, భీష్మ డైరెక్ట‌ర్ వెంకీ ఈ అవార్డు కోసం పోటీ ప‌డినా ఫైన‌ల్‌గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెచ్చే సినిమా తీసిన వెంకీ కుడుముల‌కే హెరాల్డ్ బెస్ట్ డైరెక్ట‌ర్‌ అవార్డు FEB 2020 అవార్డు వెంకీ సొంతం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వెంకీకి ఇండియా హెరాల్డ్ వ‌సుధైక కుటంబం త‌ర‌పున అభినంద‌న‌లు తెలియ‌జేయ‌డంతో పాటు భ‌విష్య‌త్తులో ఆయ‌న ఎన్నో హిట్ సినిమాలు తీయాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: