ఓ చిత్రంలో హీరో డైలాగ్.. టాలెంట్ ఎవరి అబ్బ సొత్తు కాదురా. అంటాడు.  నిజంగానే టాలెంట్ ఉన్నవాడు ఎవరికీ గులాం గిరీ చేయాల్సిన అవసరం ఉండదు... కష్టపడి తానేంటో నిరూపించుకుంటే చాలు.. అవకాశాలు వాటంతట అవే వస్తాయని ఎంతో మంది నిరూపించారు.  తాజాగా సోనీ టీవీలో 'ఇండియన్ ఐడల్' 11వ సీజన్ పోటీ ఓ సామాన్యమైన చెప్పులు కుట్టుకునే యువకుడు విజీతగా నిలవడంతో అవును టాలెంట్ ఎవరి అబ్బ సొత్తు కాదు అని తెలుస్తుంది.  ఇంతకీ ఆ యువకుడు పెరు సన్ని. చిన్ననాడే తన తండ్రిని కోల్పోయి చెప్పులు కుట్టుకుంటూ తల్లీ, చెల్లిని పోషించడం మొదలు పెట్టాడు.  వచ్చిన కాస్తో కూస్తో డబ్బులతో జీవనం సాగిస్తూ ఉన్న సన్నీకి చిన్ననాటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టం.

 

అలా అని అతను హిందుస్థానీ సంగీతం ఎక్కడా నేర్చుకోలేదు.  తకు ఇష్టమైన సంగీత విధ్వాంసుడు సుస్రత్ ఫతే అలీ ఖాన్ ను తన ఏకలవ్య గురువుగా భావించి, అతని పాటలు వింటూ సాధన చేశాడు. ఆయనకు భక్తుడిగా మారి, జీవితంలో ఏదైనా సాధించాలన్న తపనను పెంచుకున్నాడు. అయితే సోనీ టీవీలో 'ఇండియన్ ఐడల్' 11వ సీజన్ పోటీలు జరుగుతున్నాయని స్సేహితుల ద్వారా తెలుసుకుని, ముంబైకి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తాము ఉన్న పరిస్థితి ఎలా ఉందో తెలుసి కూడా ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తావని తల్లి చివాట్లు పెట్టింది. కానీ తనా లక్ష్యం వేరు.. అందుకే రూ. 3 వేలు అప్పు చేసి ముంబై చేరుకున్నాడు. ఇండియన్ ఐడల్ పోటీలకు వెళ్లాడు.

 

అతని నంబర్ 1072. ఓ పిచ్చి టీషర్టు, స్లిప్పర్లు వేసుకుని వెళ్లి, న్యాయమూర్తులుగా ఉన్న అనూ మాలిక్, నేహా కక్కర్ విశాల్ దద్లానీలను మెప్పించి పోటీల్లో స్థానం సంపాదించుకున్నాడు.  సన్నీ పాడిన పాటలు వీక్షకులకు తెగ నచ్చేశాయి. పోటీలు జరిగేకొద్దీ ఫ్యాన్స్ పెరిగారు. అతని స్వగ్రామం మొత్తం రోజూ ఓట్లు వేశారు. ఫైనల్స్ లో ఐదుగురు మిగలగా, మిగతావారిని ఓడించిన సన్నీ విజేతగా నిలిచాడు. బహుమతిగా రూ. 25 లక్షల నగదు, ఓ కారును గెలుచుకున్నాడు. కృషి పట్టుదల.. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవొచ్చు అని సన్నీ నిరూపించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: