బాలీవుడ్‌లో వర్సటైల్‌ యాక్టర్‌ గా పేరు తెచ్చుకుంటున్న యువ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా మరో విభిన్న పాత్రలో కనిపించనున్నాడు. స్త్రీ రోగ్‌ విభాగ్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా బేడీ కూతురు అలయా హీరోయిన్‌గా నటిస్తుండగా అనురాగ్‌ కశ్యప్‌ సోదరి అనుభూతి కశ్యప్‌ దర్శకత్వం వహిస్తోంది. ఆయుష్మాన్‌ ఖురానాకు అద్భుతమైన నటుడిగానే కాదు విభిన్న కథలు ఎంచుకునే హీరోగా కూడా మంచి పేరుంది. తన పాత్రలు, నటనతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు ఆయుష్మాన్‌.

 

ఇటీవల శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావదాన్ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో తన నెక్ట్స్‌ సినిమా స్త్రీ రోగ్ విబాగ్‌ లో గైనకాలజిస్ట్ పాత్రలో నటిస్తున్నాడట. ఇటీవల జవానీ జానేమన్‌ సినిమాతో ఆకట్టకున్న అలయా ఫర్నీచర్‌ వాలా ఈ సినిమాలో ఆయుష్మాన్‌ తో జోడి కడుతుండటంతో మూవీపై మరింత హైప్‌ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు కథా కథనాలకు సంబంధించి చిత్ర యూనిట్‌ ఎలాంటి ప్రకటనా చేయకపోయినా సినిమా టైటిల్‌ ను బట్టి కథ విషయంలో ఓ అంచనాకు వస్తున్నారు ఫ్యాన్స్.

 

స్త్రీల ఆరోగ్య సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానా లేడీస్‌ డాక్టర్‌గా కనిపించనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. ఆయుష్మాన్‌ గత చిత్రాల తరహా లోనే కామెడీ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంటుందని తెలుస్తోంది. ఆర్టికల్‌ 15, బాలా, అంధాదున్‌, శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌ సినిమాల్లో నటించిన ఆయుష్మాన్‌ ఖురానా మరోసారి మ్యాజిక్‌ చేయటం గ్యారెంటీ అని భావిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

“Sharm hee toh mard ka gehna hai.” Photography by @kunalgupta91 Styled by @ishabhansali Make up by @hinaldattani Hair by @mohdjaved7639 of @aalimhakim

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on

మరింత సమాచారం తెలుసుకోండి: