ఇండియా హెరాల్డ్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఫిబ్ర‌వ‌రి అవార్డు కోసం నాలుగు సినిమాల నుంచి న‌లుగురు సినిమాటోగ్రాఫ‌ర్లు ప్ర‌ధానంగా రేసులో ఉన్నారు. ఇటీవ‌ల తెలుగు సినిమా సినిమాటోగ్ర‌ఫీ విలువ‌లు పెరుగుతున్నాయి. ప్ర‌తి సినిమాకు దాదాపుగా సినిమాటోగ్ర‌ఫీ రిచ్ గా, క‌ల‌ర్ ఫుల్‌గా ఉంటోంది. ఇక ఫిబ్ర‌వ‌రి సినిమాల్లో సినిమాటోగ్ర‌ఫీ విశ్లేషిస్తే జాను సినిమాకు మహేంద్రన్ జయరాజు విజువల్స్ కూడా బాగున్నాయి. చాలా తక్కువ లొకేషన్లలో సినిమాను తీసేసినా సరే.. మొనాటనస్ ఫీలింగ్ రాకుండా కెమెరాతో మ్యాజిక్ చేశాడు మహేంద్రన్. ఫీల్ గుడ్ మూవీ కావ‌డంతో కెమేరా వ‌ర్క్ అందుకు త‌గ్గ‌ట్టుగా ఉండాలి. లేక‌పోతే ఈ ఫీలింగ్ తో ప్రేక్ష‌కుడు ట్రావెల్ అవ్వ‌లేడు. ఏదైతే సినిమా క‌థ ఉందో దానికి త‌గిన ఫీల్ తెర‌మీద‌కు వ‌చ్చేలా చేయ‌డంలో మ‌హేంద్ర‌న్ స‌క్సెస్ అయ్యాడు.

 

ఇక వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాకు జయకృష్ణ గుమ్మడి ఛాయాగ్రహణం ఓకే. సినిమాలో మోడ్ర‌న్ ల‌వ్ స్టోరీతో పాటు ఇల్లెందు ట్రాక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ సీన్‌కు త‌గిన‌ట్టుగా ఆ వాతావ‌ర‌ణం ఎలివేట్ చేసేలా జ‌య‌కృష్ణ సినిమాటోగ్ర‌ఫీ ఉంది. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదు. ఆ సంస్థ పెట్టిన ప్ర‌తి రూపాయి తెర‌మీద క‌న‌ప‌డేలా చేయ‌డంలో జ‌య‌కృష్ణ ప‌నిత‌నం ఎంతో ఉంది. ఇక భీష్మ సినిమా సినిమాటోగ్రాఫ‌ర్ సాయిశ్రీరామ్ విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ లో రాజీ లేకపోవడం అతడికి కలిసొచ్చింది. సితార ఎంట‌ర్టైన్‌మెంట్ ఒక పెద్ద హీరో సినిమా స్థాయిలో నిర్మాణ విలువలు పాటించింది.

 

ఇక హిట్ సినిమా ఫొటోగ్రాఫ‌ర్ మణికందన్ ఛాయాగ్రహణం కూడా సినిమాలోని ఇంటెన్సిటీని చూపించడానికి తోడ్పడింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. పై మూడు సినిమాల‌తో పోలిస్తే హిట్ డిఫ‌రెంట్ మూవీ... దీని సినిమాటోగ్ర‌ఫీ కూడా చాలా వైవిధ్యంగా ఉండాలి. ఆ విష‌యంలో మ‌ణికంద‌న్ నూటికి నూరుశాతం స‌క్సెస్ అయ్యాడు. ఓవ‌రాల్‌గా ఈ న‌లుగురు సినిమాటోగ్రాఫ‌ర్లు ఉత్త‌మమైన ప‌నితీరు క‌న‌ప‌రిచినా కూడా మ‌ణికంద‌న్ ప‌డిన క‌ష్టానికి .. అత‌డు చూపించిన వైవిధ్యం నేప‌థ్యంలో అత‌డికే హెరాల్డ్ బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్‌ అవార్డు FEB 2020 ద‌క్కింది. మ‌ణికంద‌న్‌కు ఇండియా హెరాల్డ్ వ‌సుధైక కుటుంబం త‌ర‌పున అభినంద‌న‌లు.

మరింత సమాచారం తెలుసుకోండి: