మహేష్ 50 కోట్ల పారితోషికం లేనిదే సినిమాలను చేయడు. అయితే ఈసారి మాత్రం చిరంజీవి కోసం 30 కోట్లకే సినిమాను చేస్తున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల చిరంజీవిల ‘ఆచార్య’ మూవీలో 30 నిముషాల ప్రత్యేక పాత్రకు మహేష్ లైన్ క్లియర్ చేయడమే కాకుండా దీనికి సంబంధించిన ఎగ్రిమెంట్ పేపర్స్ పై సంతకం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 


ఈ సినిమాకు సంబంధించి 30 రోజుల కాల్ షీట్స్ మహేష్ ఇచ్చాడని దీనికోసం రోజుకు కోటి రూపాయల చొప్పున మహేష్ కు పారితోషికం ఇస్తున్నట్లు ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దేవస్థానం భూముల మాఫియా చుట్టూ తిరిగే ఈ కథలో ఈ మాఫియాను ఎదిరించే క్రమంలో చిరంజీవి చేసే పోరాటానికి విద్యార్థి సంఘ నాయకుడుగా మహేష్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. 


స్వతహాగా కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువగా ఉండే కొరటాల తన భావాలు అన్నింటిని మహేష్ కు క్రియేట్ చేసిన ర్యాడికల్ విద్యార్థి సంఘ నాయకుడి పాత్రలో చూపిస్తాడని తెలుస్తోంది. వాస్తవానికి మహేష్ ను ఈ పాత్ర కోసం ఒప్పించదానికి చరణ్ తో పాటు కొరటాల కూడ చాల రాయబారాలు చేయవలసి వచ్చింది. 


వాస్తవానికి వంశీ పైడిపల్లి మూవీ క్యాన్సిల్ కావడంతో మహేష్ కు మరో సినిమా సెట్ చేసుకోవడానికి కనీసం రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. దీనితో ఈ గ్యావు ను చాల వ్యూహాత్మకంగా మహేష్ చిరంజీవి కొరటాల మూవీలో నటిస్తూ తన సినిమాల గ్యాప్ ను ఎక్కడా లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఇది ఇలా ఉండగా చిరంజీవి కొరటాల మూవీలో మహేష్ ను ప్రత్యేక పాత్రకు ఎంపిక చేసిన విషయం ఖరార్ కావడంతో ఈ న్యూస్ అల్లు కాంపౌండ్ కు అనుకోని షాక్ ఇవ్వడమే కాకుండా ఈ సంవత్సరం ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురములో’ రికార్డులను చిరంజీవి మహేష్ ల ‘ఆచార్య బ్రేక్ చేస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నట్లు టాక్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: