టాలీవుడ్‌లో ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఉత్త‌మ స్క్రీన్ ప్లే అవార్డు కోసం ప‌లువురు ద‌ర్శ‌కులు పోటీ ప‌డినా ఓ యంగ్ డైర‌క్ట‌ర్ త‌న‌దైన మ్యాజిక్‌తో మాయ చేసి త‌న స్క్రీన్ ప్లేతో అంద‌రిని ఆక‌ట్టుకుని క‌ట్టిప‌డేశాడు. జాను ద‌ర్శ‌కుడు ప్రేమ్ కుమార్‌, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్‌, భీష్మ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల‌, హిట్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ శైలేష్ ఇలా ప‌లువురు డైరెక్ట‌ర్ త‌మ‌దైన స్టైల్లో స్క్రీన్ ప్లేతో ప్రేక్ష‌కుల‌ను మ్యాజిక్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. జాను డైరెక్ట‌ర్ క‌మ్ రైట‌ర్ అయిన ప్రేమ్ కుమార్ స్క్రీన్ ప్లే ప‌రంగాను డైరెక్ష‌న్ ప‌రంగా వంక పెట్టేందుకు వీలులేదు.

 

ఇద్ద‌రు ప్రేమికులు నిజ జీవితంలో ఎలా ఉంటారో ?  వాళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో చూపించేందుకు ప్రేమ్‌కుమార్ ప‌డిన క‌ష్టం అంతా ఇంతా కాదు. అతడి అనుభవాలు ఎంత వరకు ఉన్నాయో కానీ.. చాలామంది ఈ కథతో.. సన్నివేశాలతో రిలేట్ అయ్యేలా సినిమాను తీర్చిదిద్దాడు. అయితే స్క్రీన్ ప్లే నెరేష‌న్ మాత్రం చాలా స్లోగా ఉంది. త‌మిళ్‌లో 96 పేరుతో తీసిన క‌థ ఇక్క‌డ రీమేక్ కావ‌డంతో ఇక్క‌డ పెద్ద‌గా త‌న టాలెంట్ చూప‌డానికి స్కోప్ లేదు.


 
ఇక వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ డైరెక్ట‌ర్ క్రాంతి మాధవ్ పూర్తిగా చేతులు ఎత్తేశాడు. ఈ సినిమా కోసం అటు నిర్మాత‌లు.. హీరో విజ‌య్ ప‌డిన క‌ష్టం అంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరే అయ్యింది. స్క్రీన్ ప్లే ఏ మాత్రం ఆస‌క్తిగా లేదు. ఇక భీష్మ సినిమా డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల పాత క‌థ‌తో కూడా స‌రికొత్త స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసి దంచేశాడు. ఎంట‌ర్టైనింగ్ స్క్రీన్ ప్లే ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేసింది. ఇక హిట్ సినిమా డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ శైలేష్ కూడా కొత్త ద‌ర్శ‌కుడు అయినా క్రైం జాన‌ర్‌లో పట్టున్న ద‌ర్శ‌కుడిలా ఈ సినిమాను డీల్ చేశాడు. ఓవ‌రాల్‌గా చూస్తే ఫిబ్ర‌వ‌రి నెల‌లో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు భీష్మ సినిమాకు గాను వెంకీ కుడుముల సొంతం చేసుకున్నాడు. వెంకీ కుడుములకు ఇండియా హెరాల్డ్ వ‌సుధైక కుటుంబం త‌ర‌పున అభినంద‌న‌లు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: