తెలుగులో సినిమా అవకాశాల కోసం హీరోయిన్లు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు ఒక హిట్ రాగానే తెలుగులో నిలబడాలని భావిస్తూ వచ్చిన అవకాశాలను వదులుకోవడం లేదు. అయితే కొంత మంది హీరోయిన్ లు నిలబడినట్టే నిలబడి ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య. ముఖ్యంగా తెలుగులో దాదాపు ఆరేళ్ళ నుంచి నిలబడిన రాశీ ఖన్నా మాత్రం సరైన హిట్ లేక అవస్థలు పడుతుంది. నటన ఉంది, అందం ఉంది అయినా సరే ఆమె మాత్రం నిలబడటంలో ఇబ్బంది పడుతుంది. 

 

ప్రతిరోజు పండగే అనే సినిమా సాయి ధరమ్ తేజ్ తో చేసింది రాశీ.. ఆ సినిమా మంచి హిట్ అయింది. దీనితో నిలబడింది అనుకున్నారు. కాని వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో మళ్ళీ ఫ్లాప్ ని ఎదుర్కొంది. గతంలో కూడా అంతే ఒక సినిమా హిట్ అయితే ఒక సినిమా ఫ్లాప్ అవుతుంది. అలా అని ఆమెకు అవకాశాలు రాక ఏమీ కాదు. మంచి మంచి అవకాశాలే వస్తున్నాయి. చిన్న హీరోలతో వస్తున్నాయో పెద్ద హీరోలతో వస్తున్నాయో అవకాశాలు మాత్రం పర్వాలేదు అనే చెప్పవచ్చు. కాని ఆమె మాత్రం వరుస హిట్ లు కొట్టలేకపోతుంది. 

 

ఆమె తర్వాత వచ్చిన పూజ హెగ్డే, రష్మిక మంధన సహా ఇద్దరు ముగ్గురు హిట్స్ కొడుతుంటే ఆమె మాత్రం ఇబ్బంది పడుతుంది. టాలివుడ్ లో ఆమె మీద మంచి అభిప్రాయం ఉంది. పరిచయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అవకాశాలకు వచ్చిన ఇబ్బంది కూడా పెద్దగా ఏమీ లేదు. అయినా సరే రాశీ మాత్రం ఏదోక సమస్యను ఎదుర్కొంటూనే ఉంది. ప్రస్తుతం రాశీ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఈ రెండు మూడు సినిమాలు కూడా ఆమెకు హిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆమె కెరీర్ ఇబ్బంది పడటం ఖాయమని అంటున్నారు టాలీవుడ్ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: