నాగార్జున సమంత ను అక్కినేని కుటుంబ కోడలుగా కంటే సొంత కూతురుగా అభిమానిస్తాడు. ఈ విషయాన్ని నాగ్ అనేకసార్లు ఓపెన్ గానే చెప్పాడు. అయితే ఇప్పుడు సమంత నాగచైతన్య లు తీసుకున్న ఒక నిర్ణయం నాగార్జునకు అసంతృప్తిని కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. 


సమంత చైతన్యలు కలిసి ‘ఎఎన్ఎస్’ ప్రొడక్షన్ హౌస్ పేరిట ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ ను లాంచ్ చేస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థ ఆద్వర్యంలో అనేక చిన్న సినిమాలతో పాటు నాగచైతన్య సమంత కలిసి నటించే ఒక మూవీ కూడ ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రొడక్షన్ హౌస్ లాంచింగ్ ఈ సమ్మర్ లో ఉంటుంది అని అంటున్నారు. 


అయితే ఇలా సమంత నాగచైతన్య లు వేరుగా ప్రొడక్షన్ హౌస్ ను పెట్టుకోవడం నాగార్జునకు ఏమాత్రం ఇష్టం లేదని గాసిప్పులు వస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ఉండగా వేరే ప్రొడక్షన్ హౌస్ అవసరం ఏమి వచ్చింది అని నాగార్జున ఎన్నిసార్లు సలహాలు ఇచ్చినా నాగచైతన్య సమంత లు నాగ్ సలహాలను పట్టించుకోలేదని తెలుస్తోంది. 


దీనికితోడు ఈ విషయం బయటకు పొక్కడంతో నాగార్జున సన్నిహితులు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ను పక్కకు పెట్టి తమ సొంత నిర్మాణ సంస్థను ఎందుకు పెట్టుకుంటున్నారు అని సున్నితంగా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నాగ్ తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు టాక్. దీనితో నాగ్ అసహనాన్ని దృష్టిలో పెట్టుకుని సమంత చైతన్యల ఆలోచనలలో మార్పులు వస్తాయా లేదంటే వారి ప్లాన్ ప్రకారం వారి సొంత నిర్మాణ సంస్థ ప్రారంభం జరిగిపోతుంద అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో పెరిగిపోతోంది. ఇది ఇలా ఉండగా ఒక కొత్త దర్శకుడు చెప్పిన లైన్ విని సమంత నాగచైతన్యలు కలిసి ఆ మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటూ వార్తలు హోరేత్తిపోతున్నాయి. దీనితో ఆ కొత్త దర్శకుడు ఎవరు అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: