చిరంజీవి రాజకీయాల నుండి దూరం జరిగి తన సినిమాలు తాను చేసుకుంటూ ఉన్నా చిరంజీవిని మాత్రం రాజకీయాలు వదలడం లేదు. మెగాస్టార్ చిరంజీవి నివాసం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు అని వార్తలు వస్తున్నాయి. అమరావతి జేఏసీ నాయకులు చిరంజీవి నివాసం ముందు ధర్నాకు పిలుపు ఇచ్చిన నేపధ్యంలో    చిరు ఇంటి ముందు సెక్యూరిటీని విపరీతం గా పెంచారు అని తెలుస్తోంది. 


మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చిరంజీవి ఇంటికి దరిదాపుల్లోకి ఎవరినీ రానీయకుండా బారీకేడ్లను ఏర్పాటు చేని నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అమరావతి పరీరక్షణ జేఏసీ మాత్రం చిరు ఇంటి ఎదుట జరుగుతున్న ధర్నాతో తమకు ఎలాంటి సంబంధం లేదని  తెలుపడంతో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నది ఎవరు అన్న విషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది. 


ఈ విషయం బయటకు లీక్ కావడంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున చిరంజీవి  నివాసం వద్దకు చేరుకుని ఆయనకు మద్దతుగా నినాదాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పలువురు సినిమా హీరోల ఇళ్ల ఎదుట కూడా అమరావతి రైతులు ఇలాగే ఆందోళనలు నిర్వహించారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇంటి దగ్గర కూడా టెంట్లు వేసి నిరసన దీక్షలు  చేపెట్టినా ప్రయోజనం లేకపోయింది.

 

ఈ విషయాల పై ఏ టాప్ హీరో ప్రస్తుతం ఒక్క మాట కూడ మాట్లాడటం లేదు. ఆంధ్రప్రదేశ్ నిట్టనిలువుగా రెండు ముక్కలుగా విభజించబడి రెండు రాష్ట్రాలుగా మారిపోయినప్పుడు కూడ మన టాప్ హీరోలు మాట్లాడలేదు. అయితే ఇప్పుడు అమరావతి రైతుల కోసం సంఘీ భావం తెలిపి మన హీరోలు మిగతా ప్రాంతాలలోని  తెలుగువారికి శతృవులుగా మారుతారు అనుకోవడం అవివేకం. ముఖ్యంగా ఎలాంటి వివాదాస్పద విషయాల పైనా స్పందించకుండా తెలివిగా వ్యవహరించే చిరంజీవి అమరావతి రైతుల బాధల గురించి స్ప్సందిస్తాడు అనుకుంటే అది అవివేకమే అవుతుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: