25 సంవత్సరాల రాజకీయాలు చేస్తూ ప్రజలకు సేవ చేయాలి అన్న ధ్యేయం తో పవన్ ‘జనసేన’ పార్టీ తో జనం మధ్యకు వచ్చి గత ఎన్నికలలో పోటీ చేసినప్పుడు కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే వచ్చి పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఎమ్.ఎల్.ఏ గా ఓడిపోవడంతో పవర్ స్టార్ ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతాడు అని భావించారు అంతా. అయితే అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ పవన్ తన రాజకీయాలకు సంబంధించిన వేగం పెంచడమే కాకుండా ఎవరూ ఊహించని విధంగా పవన్ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలలో నటిస్తూ మరొక వైపు రాజకీయాలు కొనసాగిస్తున్నాడు.


ఇలాంటి పరిస్థితులలో పవన్ రెండు పడవల ప్రయాణం పై నెగిటివ్ కామెంట్స్ పెరిగి పోతున్నాయి. ఇప్పుడు ఈ కామెంట్స్ అన్నీ జనసైనికుల దృష్టికి రావడంతో వారు ఈ విషయం పై చాల విభిన్నంగా స్పందిస్తున్నారు. రాజకీయాలలో  ఉంటూ సినిమాలు చేసుకుంటున్న బాలయ్యకి ఒక న్యాయం పవన్ కి మరో న్యాయమా అంటూ పవన్ వీరాభిమానులు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. 


బాలకృష్ణ ఎమ్.ఎల్.ఏ గా  గెలిచినా ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలకు రాడనీ ఏ విషయం పై అయినా పోరాటం చేయడనీ కనీసం అన్యాయాన్ని ప్రశ్నిస్తాను అని అనకపోయినా బాలయ్యను ఎవరు పట్టించుకోరని పవన్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఎమ్ ఎల్ ఏ గా ఓడిపోయినా ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు చైతన్యం కలిగించాలని పవన్ చేస్తున్న ప్రయత్నాలను మాత్రం తప్పు పడుతూ జనం కామెంట్స్ చేయడం ఏమిటి అంటూ పవర్ స్టార్ అభిమానులు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. 


ప్రస్తుతం ఈ విషయమై బాలయ్య పవన్ అభిమానుల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే పవన్ అభిమానులు భావిస్తున్నట్లుగా బాలకృష్ణ రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్నా లేకపోయినా దానివల్ల తెలుగు దేశం పార్టీకి వచ్చే నష్టం లేదు. అయితే పవన్ కళ్యాణ్ చుట్టూ మాత్రమే జనసేన రాజకీయాలు తిరుగుతాయి. బాలయ్య ఎప్పుడు తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పలేదు. అయితే పవన్ అనేక సార్లు తన ఉపన్యాసాలలో జనం ఓట్లు వేస్తే తాను ముఖ్యమంత్రి అయి భారీ మార్పులు తీసుకు వస్తాను అంటూ భారీ ప్రకటనలు ఇచ్చాడు. దీనితో ప్రస్తుతం బాలయ్య సినిమాలలో నటించడం పవన్ సినిమాలలో నటించడం ఒకే కోణంలో చూడటం సరికాదు అన్న సింపుల్ పాయింట్ పవన్ అభిమానులు ఎందుకు మర్చిపోతున్నారు అన్నది సమాధానం లేని ప్రశ్న..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: