ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్స్ తో గోల్డెన్ లెగ్ అనిపించుకుంటున్న కన్నడ బ్యూటీ రష్మిక.. ఈ ఏడాది వరుసగా రెండు సినిమాలు సరిలేరు నీకెవ్వరు, భీష్మ తో బంపర్ విజయాలు అందుకుంది.  ఛలో మూవీతో తెలుగులోకి అడుగు పెట్టిన ఈ కన్నడ బ్యూటీ అక్కడ కిర్రార్ పార్టీతో తన కెరీర్ ప్రారంభించింది.  తెలుగు లో నాగశౌర్య నటించిన ‘ఛలో’ మంచి విజయం అందుకుంది.  ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ‘గీతా గోవిందం’ బాక్సాఫీస్ షేక్ చేసింది. ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది.  

 

ఆ తర్వాత నాగార్జున, నాని కాంబినేషన్ లో వచ్చిన ‘దేవదాస్’ తో మరో విజయం అందుకుంది.  ఇలా నటించిన ప్రతి సినిమా రష్మికకు బాగా కలిసి వచ్చాయి.  మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సరసన నటించే అదృష్టం దక్కించుకున్న ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఓ మూవీలో నటిస్తుంది.  తాజాగా రష్మిక మందన కుటుంబానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. రాజ వంశీకునిగా ఈ చిత్రంలో తలపై పాగా, నడుమున కత్తి పెట్టుకుని ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు చూశారా? అతను టాలీవుడ్ బ్యూటీ రష్మిక తండ్రి మదన్ మందన.

 

రష్మికకు ఎడమవైపున ఉన్నది ఆమె తల్లి సుమన్ మందన.. ఇక రష్మిక చక్కనెక్కిన చిన్నది ఎవరో కాదు ఆమె చెల్లెలు శిమన్ కు బహుశా ఆరేడు సంవత్సరాలు ఉండవచ్చు. ఈ లేటెస్ట్ చిత్రాన్ని రష్మిక, తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫొటో వైరల్ కాగా, ఫ్యాన్స్ నుంచి తెగ కామెంట్లు వచ్చేస్తున్నాయి. ట్విస్ట్ ఏంటేంటే ఆమెకు చెల్లికి వయసు ఇంత తేడా ఉందా అని ఆశ్చర్యపోతూ కామెంట్స్ పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: