మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ బేస్ గురించి తెలియని విషయం కాదు. 80-90వ దశకాల్లో చిరంజీవి ఫ్యాన్స్ పేరిట అసోసియేషన్లు అఫిషియల్ గా రిజిస్టర్ అయినవే 15వేల వరకూ ఉండేవని మెగా ఫ్యాన్స్ అంటూంటారు. తర్వాత కాలంలో రాష్ట్ర చిరంజీవి యువత పేరుతో చిరంజీవి ఫ్యాన్స్ ఏర్పడింది. చిరంజీవి కుటుంబం నుంచి హీరోలు రావడంతో మెగా ఫ్యాన్స్ అసోసియేన్లన్నీ కూడా రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలోనే ఉన్నాయి.

 

 

ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రధానాంశంగా మారిన మూడు రాజధానుల అంశానికి చిరంజీవి తన మద్దతు ప్రకటించారు. దీంతో కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అమరావతి జేఏసి పేరుతో చిరంజీవి ఇంటి ముందు ఒకరోజు ధర్నా చేస్తామని కొన్ని రోజుల క్రితం ప్రకటన వచ్చింది. దీంతో అలర్టైన్ మెగా ఫ్యాన్స్ వీరి ధర్నాను అడ్డుకోవటానికి పిలుపునిచ్చారు. అందరూ హైదరాబాద్ కు తరలిరావాలని రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. చిరంజీవికి అండగా ఉంటామంటూ రెండు రాష్ట్రాల నుంచి మెగా ఫ్యాన్స్ వేలల్లో చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. కానీ చిరంజీవి ఇంటి ముట్టడి అంటూ తామెలాంటి పిలుపు ఇవ్వలేదని అమరావతి ఐకాస అంటోంది. అయినా చిరంజీవికి అండగా కదిలారు.

 

 

చిరంజీవిని సినిమాల్లో ఎంత ప్రోత్సహించారో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన సమయంలోనూ చిరంజీవి అభిమానులు అంతే సపోర్ట్ చేశారు. ఆయన ప్రతి అడుగులోనూ వెన్నంటి నడిచారు.  చిరంజీవి పిలుపుతో రక్త, నేత్రదానాల్లో విరివిగా పాల్గొని రెండు దశాబ్దాలుగా చిరంజీవి ఆశయాన్ని పాటిస్తున్నారు. 1995లో అల్లుడా మజాకా సినిమా విషయంలో వివాదం వచ్చినప్పుడు కూడా ర్యాలీలు నిర్వహించి సినిమాకు ఏ సర్టిఫికెట్, కొన్ని సీన్లు కట్ కాకుండా అడ్డుకున్నారు. చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన వారందరినీ అభిమానించి హీరోల్ని చేశారు.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: