టాలీవుడ్‌లో సంక్రాంతి సంద‌డి త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి నెల‌లో నాలుగు శుక్ర‌వారాల్లో నాలుగు పెద్ద , ఓ మోస్త‌రు అంచ‌నాలు ఉన్న సినిమాలు వ‌చ్చాయి. ముందుగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో శ‌ర్వానంద్ - స‌మంత జంట‌గా వ‌చ్చిన జాను రిలీజ్ అయ్యింది. జాను సినిమా ఒరిజినల్ మూవీ సృష్టించిన మేజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. దిల్ రాజు బ్యానర్ లో ఇదొక ఫ్లాప్ మూవీగా నిలిచింది. 19 కోట్ల రూపాయల బిజినెస్ చేసిన ఈ సినిమా 8 కోట్ల దగ్గరే చతికిలపడింది. దీంతో ఆ మేరకు బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. ఆంధ్రా, తెలంగాణలో ఈ సినిమా 6 కోట్ల 47 లక్షల రూపాయల షేర్ దగ్గరే ఆగిపోయింది. ఓవర్సీస్ లో రిలీజైన రెండో రోజు నుంచే ఈ సినిమాను చూసే నాథుడు లేడు. ఫలితంగా 60 లక్షల రూపాయల దగ్గరే జాను ఆగిపోయింది.



ఇక రెండో శుక్ర‌వారం రిలీజ్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ ఏకంగా రు. 30.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసి కేవ‌లం రు.10 కోట్ల షేర్‌తో భారీ న‌ష్టాలు మూట‌క‌ట్టుకుంది. విజ‌య్ కెరీర్‌లో ఇది వ‌రుసగా నాలుగో ప్లాప్ అవ్వ‌డంతో అత‌డి మార్కెట్ పూర్తిగా కొలాబ్స్ అయ్యింది. బ‌య్య‌ర్లు భారీగా న‌ష్ట‌పోవ‌డంతో అటు నిర్మాత కేఎస్‌. రామారావు వీళ్ల‌కు అమౌంట్లు తిరిగి ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ సినిమాతో ఆయ‌న భారీగా న‌ష్ట‌పోయాడు. ఇక హీరో విజ‌య్ కూడా త‌న రెమ్యున‌రేష‌న్‌లో కొంత మొత్తం తిరిగి ఇచ్చాడ‌ని టాక్‌..?



ఇక మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మూడో వారంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ సొంతం చేసుకుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేస్తోంది. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, ఆ తరువాత కూడా అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. నితిన్ కెరీర్‌లోనే ఇది పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. ఇండియాలో తొలి 6 రోజుల్లో ఈ సినిమా 28.70 కోట్లను వసూలు చేసింది.



ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 41.30 కోట్లను రాబట్టిన ఈ సినిమా, 50 కోట్ల క్లబ్ దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా, యూఎస్ లోను తన దూకుడు కొనసాగిస్తోంది. ఇక చివ‌రి వారంలో నాని నిర్మాత‌గా, విశ్వ‌క్ సేన్ హీరోగా తెర‌కెక్కిన హిట్ మూవీ క్రైం జాన‌ర్ థ్రిల్ల‌ర్గా టాక్ తెచ్చుకోవ‌డంతో పాటు తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 1.4 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇది విశ్వ‌క్‌సేన్‌కు మంచి ఓపెనింగ్స్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: