టాలీవుడ్‌లో మ‌రో నెల ముగిసింది. ఆదివారం నుంచి మార్చి నెల ఎంట‌ర్ అవుతోంది. ఫిబ్ర‌వ‌రి నెల‌లో కాస్త అంచ‌నాలు ఉన్న సినిమాలు ఏడెనిమిది వ‌ర‌కు రిలీజ్ అయ్యాయి. ప్ర‌తి శుక్ర‌వారం కాస్త చూడ‌ద‌గ్గ‌, అంచ‌నాలు ఉన్న సినిమా ఒక‌టి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ముందుగా తొలి శుక్ర‌వారం శ‌ర్వానంద్ - స‌మంత జంట‌గా న‌టించిన జాను సినిమా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఆ మ‌రుస‌టి శుక్ర‌వారం విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ రిలీజ్ అయ్యింది. ఇక మూడో శుక్ర‌వారం.. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా నితిన్ - ర‌ష్మిక జంట‌గా వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన భీష్మ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక చివ‌రి వారంలో నాని నిర్మాత‌గా విశ్వ‌క్‌సేన్ హీరోగా కొత్త ద‌ర్శ‌కుడు శైలేష్ డైరెక్ట్ చేసిన హిట్ సినిమా రిలీజ్ అయ్యింది.



ఈ నాలుగు సినిమాల్లో భీష్మ బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో ఇప్ప‌టికే రు. 50 కోట్ల షేర్‌కు చేరువైంది. ఇక హిట్ సినిమా తొలి రోజే రు 1.4 కోట్ల షేర్ రాబ‌ట్టింది అంటే మామూలు విష‌యం కాదు. హిట్ కూడా విశ్వ‌క్‌సేన్ రేంజ్ మార్కెట్‌ను బ‌ట్టి చూస్తే హిట్ అవుతుంద‌నే చెప్పాలి. ఇక మిగిలిన రెండు సినిమాల విష‌యానికి వ‌స్తే జాను, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ రెండు డిజాస్ట‌ర్ అయ్యాయి. ఈ రెండు ఒక దానిని మించి మ‌రొక‌టి డిజాస్ట‌ర్ అన్న‌ట్టు ప్లాప్ అయ్యాయి.



ఉన్నంత‌లో కాస్తో కూస్తో శ‌ర్వానంద్ - స‌మంత జాను సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌మ‌ర్షియ‌ల్‌గా ప్లాప్ అయినా క‌నీసం కొంద‌రు ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అయినా సొంతం చేసుకుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాకు అది కూడా లేకుండా పోయింది. జాను సినిమాకు రు.10 కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు వ‌చ్చాయి. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాకు ఈ న‌ష్టాలు రు.20 కోట్ల పై మాటే అని టాక్‌.



జాను నిర్మాత దిల్ రాజు కావ‌డంతో ఆయ‌న‌కు వ‌చ్చిన ఇబ్బందులు ఏమీ లేవు. ఆయ‌న సొంత బ‌య్య‌ర్లు ఆయ‌న్ను ఏమీ అడ‌గ‌రు. అయితే వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ నిర్మాత కేఎస్‌. రామారావు ఈ సినిమా కొసం ముందుగానే కొన్ని ఆస్తులు సైతం తాక‌ట్టు పెట్టి సినిమా రిలీజ్ చేశార‌ట‌. ఆయ‌న సినిమాల మీద ఫ్యాస‌న్‌తో గ‌త కొన్నేళ్లుగా చేస్తోన్న సినిమాలు ప్లాప్ కావ‌డంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ప‌డిపోయార‌ని ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సర్కిల్స్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: