అమితాబ్ బాలీవుడ్ సూపర్ స్టార్.  తన డైలాగ్ డెలివరీతో తనదైన యాక్షన్ తో అమితాబ్ గత యాభై దశాబ్దాలుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడు.  ఏ సినిమా చేసినా అందులో వైవిధ్యం ఉంటుంది.  ఎంత కష్టమైన పాత్ర అయినప్పటికీ కూడా అమితాబ్ చేస్తే దానికి ఓ లెక్క ఉంటుంది.  ప్రేక్షకులకు కిక్ వస్తుంది. ఎన్నో సినిమాలు చేసిన అమితాబ్, పింక్ సినిమాలో చాలా వైవిధ్యభరితమైన ఎమోషనల్ తో సాగే లాయర్ పాత్రలో నటించి మెప్పించారు.  


సినిమా అప్పట్లో భారీ విజయం సొంతం చేసుకుంది.  ఈ సినిమా విజయంతో అమితాబ్ కు మరింత పేరు వచ్చింది.  అంతేకాదు, ఈ సినిమాపై సౌత్ ఇండస్ట్రీ కన్ను పడింది.  దీనిని తమిళంలో మెయిన్ లీడ్ రోల్ చేశాడు.  హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ కూడా సంచలన విజయం సొంతం చేసుకుంది.  బోనీకపూర్ ఈ సినిమాను తమిళంలో నిర్మించారు.  


ఇక ఇదిలా ఉంటె, టాలీవుడ్ లో కూడా ఈ సినిమా రీమేక్ అవుతున్నది.  టాలీవుడ్ లో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  ఇందులో అమితాబ్ పోషించిన లాయర్ పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు.  ఎమోషనల్ గా సాగె ఈ పాత్రలో పవన్ ఎలా నటిస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.  ఎమోషనల్ పాత్రలను చేయడంలో పవన్ కళ్యాణ్ దిట్ట.  అందులో సందేహం అవసరం లేదు.  


అయితే లాయర్ తరహా పాత్రలు చేయడం ఇదే మొదటిసారి.  అమితాబ్ ను మించేలా చేస్తారా లేదా అన్నది ఇప్పుడు అందరిముందున్న ప్రశ్న.  పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి వైబ్ ఉంటుంది.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మార్చి 2 వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.  అలానే మార్చి 8 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతున్నది. వారం రోజుల వ్యవధిలో పవన్ సినిమా నుంచి రెండు అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం అని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: