నేటి సమాజంలో రోజురోజుకి కొత్త రకాల వైరస్ లు వచ్చి మానవ జాతి మనుగడ ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వాలు వాటిని ఎంత అరికడదామని చూస్తున్నా మాత్రం ఉపయోగం ఉండడంలేదు. తాజాగా చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రభావం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తర్వాత ఇంకొక వైరస్ మహమ్మారి వల్ల ఎన్నో వేల కోళ్ళు కూడా తమ ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే.

 

ప్రస్తుతం మరొక వైరస్ మానవాళిని కబలించింది. అయితే వైరస్ సోకింది మాత్రం మనుషులకు కాదు. మానవాళికి జీవనాధారమైన చెట్లకు. మనిషులకు, జంతువులకు ఉన్నట్టే చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది అన్న విషయం మనకు తెలిసిందే. మనిషి ఉనికికి ఎంతో అవసరమైనా కొన్ని వేలకు పైగా చెట్ల యొక్క ప్రాణాలను 'రుగోస్' అనే కొత్త వైరస్ బలితీసుకుంది. వైరస్ మరీ ముఖ్యంగా పండ్లతోటలకు ఎక్కువగా వ్యాపిస్తుంది.

 

IHG

 

మొట్టమొదటిసారిగా వైరస్ ను కేరళలో కనుగొన్నారు. అక్కడి నుంచి వైరస్ తమిళనాడు మీదగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందిఏపీలో మొదట గోదావరి, కృష్ణా,విశాఖ, విజయనగరం జిల్లాలోని కొబ్బరి, పామాయిల్,పండ్లతోటలపై ప్రభావం చూపింది వైరస్ దెబ్బకు పంటలు నాశనమవుతున్నాయిఇప్పుడు ఇది ఖమ్మం జిల్లాలోని పామాయిల్ తోటలపై ప్రభావం చూపుతున్నది

 

IHG

 

ఇప్పటివరకూ 10,226 హెక్టాత్ల కొబ్బరి తోట మరియు 11,774 హెక్టార్ల పామ్ ఆయిల్ తోటలు వైరస్ వల్ల నాశనం అయిపోయాయి. అలాగే వైరస్ అరటి పండు, జామ కాయ మరియు సీతాఫలాల తోటలకు కూడా విస్తృతస్థాయిలో వ్యాపించింది. ఈవైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నారుకానీ, తగ్గేలా కనిపించడం లేదుతెల్లదోమలు పంటలపై వాలి మలమూత్రాలు చేయడం వలన వైరస్ సోకుతున్నట్టుగా గుర్తించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: