తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున నటించిన చిత్రాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.  కెరీర్ బిగినింగ్ లో యాక్షన్ తరహా చిత్రాల్లో ఎక్కువగా నటించాడు.  రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ తో నాగార్జున ఓ ట్రెండ్ సృష్టించారు.  ఆ తర్వాత గీతాంజలి, మజ్ను లాంటి భగ్నప్రేమికుడి పాత్రల్లో నటించి మెప్పించారు. తర్వాత కాలంలో ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.  అంతే కాదు నాగార్జున  అన్నమయ్య, రామదాసు, షిరిడీసాయి లాంటి భక్తిరస చిత్రాలతో మెప్పించారు.  ఎలాంటి పాత్రల్లో అయినా ఇమిడిపోయే నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ లాంటి ఫుల్ లెన్త్ ఎంట్రటైన్ మెంట్ తో దుమ్మురేపారు.   

 

ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించారు. ఇందులో ద్విపాత్రాభినయంలో నటించిన నాగార్జున కు సంబంధించి ఒక క్యారెక్టర్ పేరు బంగార్రాజు.   ఈ చిత్రంలో ఆ పాత్ర హైటెల్ గా నిలిచింది.  అయితే ‘సోగ్గాడే చిన్ని నాయన’  సీక్వెల్ ప్లాన్ ఎప్పటి నుంచో చేస్తున్నారు.  కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. డైరెక్టర్  కల్యాణ్ కృష్ణ ఈ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రానికి లైన్ క్లీయర్  అయిందట. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతోందట.   జూన్ నుంచి ఈ  చిత్రం పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో  నాగార్జున సరసన రమ్యకృష్ణనే కనిపిస్తుంది. చైతూ జోడీగా రష్మికను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

 

అన్నపూర్ణ బ్యానర్లో రూపొందబోతున్న ఈ చిత్రంలో నాగార్జున, చైతూ కలిసి నటించడం పై ఫ్యాన్స్ తెగ కుషీలో ఉన్నారు.  మజిలీ, వెంకిమామ చిత్రాలతో నాగ చైతన్య వరుస విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా ‘లవ్ స్టోరి’ చిత్రంలో నటిస్తున్నాడు నాగ చైతన్య. అన్నపూర్ణ బ్యానర్లో ఇటు నాగార్జునకి .. అటు చైతూకి హిట్లు ఇచ్చిన కల్యాణ్ కృష్ణ, ఈ ఇద్దరికీ  ఏ రేంజ్ లో హిట్ అందిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: