త్రివిక్రమ్ సినిమా తరువాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? 
త్రివిక్రమ్ సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  అయన సినిమాలు చాలా సున్నితమైన సబ్జెట్ తో తెరకెక్కుతుంటాయి.  ప్రతి సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది.  సినిమా సినిమాకు చాలా వ్యత్యాసం ఉంటుంది.  ముఖ్యంగా కథలో ఓ విధమైన సెంటిమెంట్ ను క్రియేట్ చేస్తుంటారు.  భావోద్వేగాలతో కూడిన కథలను సిద్ధం చేసుకొని చిత్రీకరిస్తుంటారు.  అతడు సినిమా నుంచి చూసుకుంటే ఇదే విధంగా ఉంటుంది.  


బంధాలు, అనుబంధాల గురించి హృద్యంగా చెప్తూ, కమర్షియల్ విలువలను జోడించి చెప్పడం అంటే మాములు విషయం కాదు.  అందుకే అయన సినిమాలు హిట్ అవుతుంటాయి.  అల్లు అర్జున్ తో అల వైకుంఠపురంలో సినిమా చేసిన తరువాత త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ తో అయినను పోయిరావలె హస్తినకు సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ మే నుంచి ప్రారంభం అవుతుంది.  


ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ కంప్లీట్ చేయాలనీ ప్లాన్.  ఇదిలా ఉంటె, ఈ సినిమాను జంధ్యాల మార్క్ తో రాజకీయ నేపథ్యంలో షూట్ చేస్తారని సమాచారం.  రాజకీయ నేపధ్యం కలిగిన సినిమా అంటే చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది.  జనాలకు నచ్చే విధంగా తీయగలగాలి.  త్రివిక్రమ్ కు ఇలాంటి జానర్లో సినిమా తీయడం ఇదే మొదటిసారి.  అటు రాజకీయాలకు సంబంధించిన సినిమాల్లో నటించడం కూడా ఎన్టీఆర్ కు మొదటిసారి.  


సినిమా తరువాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉన్నదా అంటే అవుననే అంటున్నారు.  2009 లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు.  ఆ సమయంలో ఎన్టీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయం సాధించేవారు. అయితే, అలా జరగలేదు.  అప్పటి నుంచి ఎన్టీఆర్  తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు.  దూరంగా ఉంటున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీ పట్ల ప్రేమ తగ్గలేదు.  ఎందుకంటే అది ఎన్టీఆర్ తాత పెట్టిన పార్టీ.  ప్రస్తుతం ఈ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నది.  ఒకవేళ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలని చూస్తే, అయన పార్టీలోకి వెళ్లే అవకాశం ఉన్నదా అంటే అవుననే అంటున్నారు.  చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: