శుక్రవారం వచ్చింది అంటే సినిమాల సందడి ఉండాల్సిందే.. ప్రతి శుక్రవారం ఎవరి ఫేట్ ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఈ ఫ్రై డే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చింది హిట్. నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో విశ్వక్ సేన్, రుహని శర్మ జంటగా నటించారు. శైలేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడిపించాడు శైలేష్. మొదటి సినిమా దర్శకుడే అయినా శైలేష్ చాలా క్లవర్ గా ఈ సినిమాను హ్యాండిల్ చేశాడు. 

 

అయితే ఈ సినిమా చూసిన తెలుగు ఆడియెన్స్ మంచి రెస్పాన్స్ అందించారు. మొదటి షో నుండే హిట్ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. సినిమా రిలీజ్ ముందే 3 నిముషాల వీడియో రిలీజ్ చేశారు. అది కూడా సినిమా మీద ఆసక్తి పెరిగేలా చేసింది. సినిమా చూసిన ఆడియెన్స్ కూడా మంచి థ్రిల్లర్ ఎక్స్ పీరియన్స్ పొందుతున్నారు. మాములుగా తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే అందులో కామెడీ ఇరికించడం.. లేదా చివరకు అదంతా అబద్ధం అన్నట్టుగా చూపించడం లాంటివి జరుగుతాయి. అయితే హిట్ మూవీలో అలా కాకుండా కేవలం కథ, కథనాల మీద ఫోకస్ పెట్టాడు దర్శకుడు శైలేష్. 

 

అసలు సిసలు సస్పెన్స్ మూవీ ఇదే అనిపించేలా హిట్ సినిమా ఉంది. సినిమా మెదటి నుండి ఎండ్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేయించడం కూడా దర్శకుడి ప్రతిభ అని చెప్పొచ్చు. అందుకే ఆడియెన్స్ కూడా ఈ సినిమాను యాక్సెప్ట్ చేశారు. నాని మరోసారి టెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అని తెలిసింది. నిర్మాతగా అ! తర్వాత హిట్ ఇలా రెండు ప్రాజెక్ట్స్ హిట్ అందుకుని హీరోగా కాదు నిర్మాతగా కూడా తను సక్సెస్ అనిపించుకున్నాడు నాని. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ముందే ఎనౌన్స్ చేస్తారు చెప్పండి. హిట్ సెకండ్ కేసు 2021లో వస్తుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: