సునీల్ , ఎస్తేర్ హీరో హీరోయిన్లుగా చేస్తున్న మూవీ భీమవరం బుల్లోడు. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ని సాధించింది. ఈ సినిమాతో మరోసారి సునీల్ కడుపుబ్బా నవ్వించబోతున్నాడని చెబుతున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాను ఫిబ్రవరి సెకండ్ వీక్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక,నిర్మాతలు. ఉదయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీతో రెండు గంటలు సరదాగా సాగిపోతుందట. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మిస్తున్నారు. నిన్ననే సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కు సెన్సార్ యు/ఎ ఇచ్చింది. అందాల రాముడితో కామెడీ యాక్టర్ నుండి హీరోగా కన్వర్ట్ అయిన సునీల్ ఆడియెన్స్ ని అలరించడానికి సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేశాడు. లాస్ట్ ఇయర్ మిస్టర్ పెళ్లికొడుకుగా ఫ్లాప్ ని ఫేస్ చేసిన సునీల్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి పట్టు పట్టాడట. కామెడీని ఎల్లవేళలా ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమాను కూడా సూపర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నారు చిత్ర యూనిట్. సో మొత్తానికి భీమవరం బుల్లోడు గా రాబోతున్న సునీల్ కి సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతుంది ఎపిహెరాల్డ్.కామ్. సునీల్ భీమవరం బుల్లోడుగా అలరిస్తాడా..? ఉదయ్ శంకర్ కి ఈ సినిమా బ్రేక్ ని ఇస్తుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: