ఈ మద్య చిన్న సినిమాలు లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాలకు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. రూమ్ లో ఆవిరులు పుట్టాలంతే. లవ్ రొమాన్స్ పేరుతో వేడెక్కించే సన్నివేశాలని బూతు కంటెంట్ పెచ్చురిల్లుతోంది. అలాంటి సీన్లు కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నా ఏమాత్రం మన మేకర్స్ లో కనిపించడం లేదు. ఇకపోతే మరీ అంత టూమచ్ గా ఏం లేదు కానీ.. కాస్త హద్దు మీరి మాత్రమే కనిపిస్తోంది.  జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా అశోక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘మిస్టర్‌ అండ్‌ మిస్‌’, పూర్తిగా కొత్తవారితో క్రౌడ్‌ ఫండెడ్‌ మూవీగా వస్తోన్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ఈ మూవీ   నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

 

చిత్ర ప్రమోషన్లలో భాగంగా మూవీ ట్రైలర్‌ను ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ విడుదల చేశారు. హీరో హీరోయిన్ల మధ్య ఘాడమైన ప్రేమ, మనస్పర్థలు బ్రేక్ అప్ వంటి విషయాలను ప్రస్తావిస్తూ ఈ మూవీ తెరకెక్కింది. ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ కలిగిన జంట కొన్ని కారణాల వలన విడిపోతే, వారి మధ్య నడిచే సంఘర్షణే ఈ మూవీ.  పెళ్లికి ముందు తమ కలయికను సెల్ఫీ వీడియో తీసుకొని తర్వాత ఆ జంట పడే కష్టాలు ఈ మూవీలో చూపించారు. అంతే కాకుండా లవ్‌లో ఉన్నప్పుడు ప్రేమజంట మధ్య వచ్చే డైలాగ్‌లు, ఓ మొబైల్‌ మిస్‌ అవడం దాని కోసం అన్వేషించడం, హీరో యాక్షన్‌ సీన్స్‌తో ఓ ఫుల్‌ పవర్‌ ప్యాక్‌ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

 

రీడింగ్‌ ల్యాంప్‌ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ యశ్వంత్‌ నాగ్‌ సంగీతమందిస్తున్నాడు. 128 సెకన్ల నిడివి గల ట్రైలర్‌లో.. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, రొమాన్స్‌, మనస్పర్థలు, బ్రేకప్‌ వంటి అంశాలను జోడించారు. అయితే ఈ మూవీ సెన్సార్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే ట్రైలర్ లో చూపించిన హాట్ సీన్లు థియేటర్లో చూపించరని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.  త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: