టాలీవుడ్ యువ నటుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నటి ఛార్మితో కలిసి పూరి నిర్మించిన సినిమా ఇస్మార్ట్ శంకర్, గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. నిజానికి అంతకముందు కొన్నాళ్లుగా ఇటు పూరికి కానీ, అటు హీరో రామ్ కి కానీ కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేదు. అయితే ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టడంతో, వారిద్దరూ కూడా కెరీర్ పరంగా మంచి ఫామ్ లోకి వచ్చారు. 

 

నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో పూరి మార్క్ స్టైల్ ఆఫ్ మేకింగ్ తో పాటు ఆయన స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ని హీరో రామ్ పలికిన విధానం, అలానే సినిమాకు ఎంతో ప్రాణంగా నిలిచిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సాంగ్స్, ఈ సినిమాకు మంచి విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వచించాయి. ఇక యాక్షన్ సీన్స్ లో అయితే రామ్ ఎంతో బాగా పెర్ఫార్మ్ చేసి, అటు యువతతో పాటు ఇటు మాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల ఈ సినిమాని హిందీ వర్షన్ లో యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 

 

అయితే యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చిన తొలి రోజు నుండి మంచి వ్యూస్ సాధిస్తూ దూసుకుపోయిన ఈ సినిమా, కేవలం 13 రోజుల్లోనే 72 మిలియన్లకు పైగా వ్యూస్ ని అలానే,1 మిలియన్ లైక్స్ ని అందుకుని నేడు సరికొత్త రికార్డు ని సృష్టించింది. ఇక తమ సినిమా ఈ విధంగా యూట్యూబ్ లో దూసుకుపోతుండడంతో దర్శకుడు పూరి, హీరో రామ్, నిర్మాత ఛార్మి తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: