ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లీడర్’ తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు దగ్గుబాటి రానా. ప్రముఖ నిర్మాత డి రామానాయుడు మనవడు.. డి. సురేష్ బాబు తనయుడు అయిన రానా హీరోగా మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేశాడు.  అప్పటికే సినీ ఫీల్డ్ లో తన బాబాయి విక్టరీ వెంకటేష్ మంచి ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే.  లీడర్ సినిమా తర్వాత రానా నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. కానీ రానా మాత్రం హీరో రోల్స్ మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా తాను ఎలాంటి పాత్రల్లో అయినా నటించి మెప్పించగలను అని ముందుకు సాగాడు.  తెలుగు తో పాటు హిందీ సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్లో నటించి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. విలన్, క్యారెక్టర్ రోల్స్ వేయడానికి రెడీ కావడం రానా కెరీర్లో పెద్ద మలుపు.

 

'బేబీ', 'బాహుబలి', 'ఘాజీ' సినిమాలతో తానెంతో వెర్సటైల్ ఆర్టిస్టునో చూపించాడు రానా. ఈ సినిమాల తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో హీరోగానూ సత్తా చాటుకున్నాడు. త్వరలోనే 'హాథీ మేరీ సాథీ' లాంటి మరో ఎగ్జైటింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రానా. అంతే కాదు రానా విరాట పర్వంలో ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే రానా పదేళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భాన్ని పురస్కరించుకు  పదేళ్ల ప్రయాణాన్ని సూచిస్తూ 'ఆర్డీ 10' పేరుతో ఒక వీడియో రూపొందించారు.

 

ఈ సందర్భంగా  రానా బాబాయి వెంకటేష్ మాట్లాడుతూ.. హీరోనా.. విలన్ అనాలో.. క్యారెక్టర్ ఆర్టిస్టు అనాలో తనకు అర్థం కాదని వెంకీ చెప్పడం విశేషం. ఇక డైరెక్టర్ తేజ అతను కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంటాడని అన్నారు. రానా గురించి అతడి తండ్రి సురేష్ బాబు మాట్లాడతూ... రానా ఇప్పటికీ తన పాత్రల్లో ప్రయోగాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడని అన్నారు.  'లీడర్'కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఏదో ఒకటి కొత్తగా చేయాలన్నది రానా తపన అని చెప్పుకొచ్చాడు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: