సంక్రాంతికి రిలీజైన సరిలేరు నీకెవ్వరు శనివారంతో 50రోజులు పూర్తి చేసుకుంది. బన్నీ నటించిన అల వైకుంఠపురములో కూడా పండుగకే రావడంతో.. ఈ ఇద్దరూ పోటీ పడి మరీ పబ్లిసిటీ చేశారు. ఒకరిని మించి మరొకరు ప్రమోషన్ చేశారు. సినిమా రిలీజై 50రోజులు అయినా.. ఆ జోరు తగ్గలేదు. ఒక రోజు ముందుగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా.. మైండ్ బ్లాక్ సాంగ్ తో పాటు.. ఫిఫ్టీడేస్ స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు. 

 

సరిలేరు నీకెవ్వరు సక్సెస్ విశ్లేషకుల అంచనాలకు అందలేదు. ఏవరేజ్ రేటింగ్స్ ఇచ్చినా.. డివైడ్ టాక్ వచ్చినా సినిమా భారీ లాభాలు తీసుకొచ్చింది. ఓవర్సీస్ లో మినహా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ అయింది. సినిమాను 100కోట్లకు అమ్మితే.. 125కోట్లకు పైగా తీసుకొచ్చింది. 

 

మహేశ్ గత రికార్డులన్నింటినీ సరిలేరు నీకెవ్వరు బ్రేక్ చేసింది. లాస్ట్ మూవీ మహర్షిలో ఫస్ట్ టైమ్ వంద కోట్ల మార్క్ దాటి.. 101 కోట్లు కలెక్ట్ చేసింది. సరిలేరు నీకెవ్వరు 125కోట్లు రాబట్టడంతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు మహేశ్. 

 

అల వైకుంఠపురములోతో పోల్చుకుంటే.. సరిలేరు నీకెవ్వరు తక్కువ కలెక్ట్ చేసినా.. దీనికొచ్చిన టాక్ తో పోల్చుకుంటే ఎక్కువే కలెక్ట్ చేసిందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇప్పటి వరకు యంగ్ హీరోలతో వరుస హిట్స్ కొట్టిన అనిల్ రావిపూడి స్టార్ తో హిట్ కొట్టి.. క్రేజ్ పెంచుకున్నాడు. మొత్తానికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మంచి కథకు క్రేజీ హీరో తోడవడంతో సినిమాకు మంచి స్పందనే వచ్చింది. ప్రేక్షకులను మూవీని బాగా ఆదరించారు. గతంలో మహేశ్ బాబు సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో ఆయన నటనకు హ్యాట్సాఫ్ చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: