ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉంది అనేది వాస్తవం. గతంలో మాదిరి ఇప్పుడు పోటీ ఎక్కువగానే ఉన్నా ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే దాని మీద దర్శక నిర్మాతలకు ఒక అవగాహన రావడం లేదు. టాలీవుడ్ లో ప్రభావం చూపిస్తారు అనుకున్న కొందరు హీరోయిన్లు అనూహ్యంగా కనుమరుగు అయిపోయారు. వాళ్లకు అవకాశాలు వచ్చినట్టే వచ్చిపోయాయి. దానికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా అవకాశాల కోసం వాళ్ళు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నా సరే పెద్దగా ఫలితం ఉండటం లేదు అనేది టాలీవుడ్ జనాల మాట. 

 

అను ఎమ్మానుయేల్ కెరీర్ మొదట్లో అవకాశాలు బాగానే కొట్టేసింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే ఆమె నటించిన ఒకటి రెండు సినిమాలు మినహా పెద్దగా హిట్ అవ్వలేదు. దీనికి కారణం ఏంటీ అనేది కూడా ఎవరికి తెలియదు. అయితే కొందరు చెప్పే కారణం చూస్తే ఆమెకు ప్రేక్షకులు ఆదరించడం లేదని అంటున్నారు. ఆమెకు అందం ఉన్నా ఆ అందం ప్రేక్షకులను ఆకట్టుకునే అందం కాదని, ఆమెకు నటన రాదని దర్శకులు కూడా భావిస్తున్నారు. ఇక ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా దాదాపు ఫ్లాప్ అయ్యాయి. 

 

దీనితో అవకాశాలు ఇవ్వొద్దని భావించారు కొందరు దర్శక నిర్మాతలు. ఆమెకు పలుకుబడి ఉన్నా సరే కొన్ని లక్షణాలు లేకపోవడంతో టాలీవుడ్ ఆమెను దూరం పెట్టింది. ఆమె నటించిన సినిమాల్లో స్కిన్ షో కూడా బాగానే చేసింది. అయినా సరే ఆమె మాత్రం పెద్దగా నిలబడలేదు టాలీవుడ్ లో. దీనికి తోడు హీరోలు కూడా ఆమెను వద్దని చెప్పినట్టు సమాచారం. ముఖ్యంగా స్టార్ హీరోలు ఆమెను తిరస్కరించారని టాక్. అటు తమిళంలో కూడా ఆమెకు అవకాశాలు రాలేదు. కన్నడం లో ట్రై చేసినా సరే పెద్దగా వద్దని చెప్పినట్టు సమాచారం. దీనితో ఇక ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: