టాలీవుడ్ స్టార్ హీరోల కుమారులు ఇప్పుడు చాలా వరకు రాణిస్తున్నారు. కొందరు పర్వాలేదనిపించినా మరికొందరు మాత్రం పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ముఖ్యంగా మంచు ఫ్యామిలీ హీరోలు పెద్ద ప్రభావం చూపించడం లేదు. అక్కినేని ఫ్యామిలీ విషయానికి వస్తే నాగ చైతన్య ఒక సినిమా ఫ్లాప్ అయినా మరో సినిమాతో హిట్ కొడుతున్నాడు. ఇక అఖిల్ విషయానికి వస్తే అతను ఇప్పటి వరకు నటించిన ఒక్క సినిమా కూడా చెప్పుకోదగిన స్థాయిలో విజయం సాధించలేదు. మూడు నాలుగు సినిమాలు చేసినా సరే అతను హిట్ అందుకోలేదు. 

 

ఒక సినిమా మాత్రం పర్వాలేదనిపించింది. అది కూడా ఉత్తమ బాలల చిత్రం అనే కామెంట్స్ తెచ్చుకుంది. దీనితో టాలీవుడ్ లో ఇప్పుడు అఖిల్ ప్రస్తానం ఏంటీ అనే ప్రశ్న ఎక్కువగా వినపడుతుంది. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. కాని ఆ సినిమా ఎంత వరకు విజయం సాధిస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. టాలీవుడ్ లో హిట్ లు లేకపోతే ప్రేక్షకులు కూడా మర్చిపోతున్నారు. స్టార్ హీరో కొడుకు అయి ఉండి కూడా అఖిల్ కి మంచి హిట్ అనేది రావడం లేదట. 

 

నాగార్జున కూడా జోక్యం చేసుకున్నా అఖిల్ మాత్రం తనకు నచ్చిన విధంగానే సినిమాలు చేస్తున్నాడు అంటున్నారు టాలీవుడ్ జనాలు. దీనితో ఇప్పుడు దర్శక నిర్మాతలు అతనితో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. ఏదైనా ఒక్క హిట్ వస్తే అఖిల్ కెరీర్ నిలబడుతుంది. కాస్త సినిమాలు ఆదరణ కూడా పొందుతాయి. కాని అతను మాత్రం ఇప్పటి వరకు అలాంటి హిట్ కొట్టలేదు. దీనితో అతని కెరీర్ పరిస్థితి ఏంటీ అనేది ఇప్పుడు టాలీవుడ్ లో ప్రధానంగా జరుగుతున్న చర్చ. నాగార్జున దృష్టి పెట్టి కొడుకు కెరీర్ ని గాడిలో పెట్టాలని అక్కినేని అభిమానులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: