టాలీవుడ్ స్టార్ హీరోలు అనగానే ఒకప్పుడు ఎక్కువగా వినపడే పేరు శ్రీకాంత్. ముఖ్యంగా అమ్మాయిల్లో అతనికి ఉన్న ఫాలోయింగ్ అప్పట్లో ఏ హీరోకి కూడా లేదు. అతని గ్లామర్ అతనికి అప్పట్లో బాగా కలిసి వచ్చింది అనే చెప్పుకోవచ్చు. దీనితో శ్రీకాంత్ తో సినిమాలు చేయడానికి అప్పట్లో అగ్ర దర్శకులు చాలా మంది పోటీ పడే వాళ్ళు కూడా. అయినా సరే శ్రీకాంత్ మాత్రం కెరీర్ పరంగా తర్వాత తర్వాత ఇబ్బంది పడ్డాడు. హీరో పాత్రలు మానేసి కాస్త కొత్తగా ట్రై చేయడం మొదలుపెట్టాడు. దీనితో అతని కెరీర్ లో ఫ్లాపులు ఎక్కువగా రావడం మొదలయింది. 

 

ఇప్పుడు అతను కెరీర్ లో డౌన్ లోనే ఉన్నాడు. విలన్ గా కేరెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరో పక్కన తమ్ముడిగా అన్నగా ఎన్ని విధాలుగా చేసినా సరే అతని కెరీర్ కి సరైన హిట్ దక్కడం లేదు. ఆపరేషన్ దుర్యోధనా తరహాలో కాస్త భిన్నమైన సినిమాలు చేసాడు. మళ్ళీ అలాంటి సినిమాలే చేసినా సరే అతని కెరీర్ మాత్రం నిలబడలేదు. మంచి హిట్ అనేది ఈ స్టార్ హీరోకి రాలేదు అనే మాట నిజం. దీనితో ఇప్పుడు అతని పరిస్థితి ఏంటీ అంటున్నారు అభిమానులు. ఇప్పుడు యువ హీరోలు ఎక్కువగానే ఉన్నారు. 

 

ఆయనతో పాటుగా ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా వరకు హిట్ సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సహా పలువురికి మంచి పోటీ ఇచ్చాడు. శ్రీకాంత్ సినిమా అనగానే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. కాని ఇప్పుడు అది ఎక్కడా కనపడటం లేదు అనే చెప్పాలి. దీనితో అతను సినిమాలు చేస్తాడా లేదా తప్పుకునే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతుంది. దాదాపు వంద సినిమాలకు పైగా శ్రీకాంత్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: