టాలీవుడ్ లో ఇప్పుడు కమెడియన్స్ పరిస్థితి ఏంటి...? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఒకప్పుడు కృష్ణా నగర్ లో కామెడి పాత్రలకు కొందరు నటులు ఎక్కువగా ప్రయత్నాలు చేసే వారు. అలాంటిది ఇప్పుడు కామెడి పాత్రలకు కూడా ఎవరూ దొరకడం లేదనే టాక్ వినపడుతుంది. సినిమాలు చేయడం మానేసి జబర్దస్త్ లాంటి టీవీ షోస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు నటులు. అక్కడ పేరుకి పేరు డబ్బుకి డబ్బు రావడంతో అవకాశాల అక్కడ ఎదురు చూస్తున్నారు. 

 

ఇక టాలీవుడ్ కూడా కమేడియన్ల విషయంలో కాస్త వెనకబడినట్టు సమాచారం. ఇప్పుడు ఎక్కువగా సినిమాల్లో దర్శకులు హీరోలు హీరోయిన్లు సహాయ నటులతో కామెడి చేయిస్తున్నారు. అంతే గాని కామెడి కోసం పెద్దగా ఎవరిని సంప్రదించడం లేదు అని అంటున్నారు. దీనితో టాలీవుడ్ లో ఈ మధ్య కమెడియన్లు ఎవరూ పెద్దగా కనపడటం లేదు. గతంలో ఎక్కువగా సినిమాల్లో కమేడియన్ల పాత్ర ఉండేది. ఇప్పుడు మాత్రం వాళ్ళు ఎక్కడా కనపడటం లేదు. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో హీరోలతో కామెడి చేయించడం మొదలుపెట్టారు. 

 

దీనితో కాస్త బడ్జెట్ కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. ఎలాగూ కామెడి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా కమెడియన్ ని తీసుకునే అవకాశం లేదు. దీనితో టాలీవుడ్ వాళ్లకు గుడ్ బై చెప్పేసింది అంటున్నారు సినీ జనాలు. మరి భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితి ఏంటీ అనేది చూడాలి. కథలు కూడా కమెడియన్ లేకుండానే రాసుకోవడం మొదలుపెట్టారు దర్శకులు, రచయితలు. గతంలో ఎక్కువగా అలరించిన కమెడియన్లు సునీల్, వేణు మాధవ్, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం ఇలా కొందరు ఇప్పుడు కనుమరుగు అయిపోయారు. సునీల్, బ్రహ్మానందం లేకుండా సినిమా ఉండేది కాదు. ఇప్పుడు సునీల్ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. బ్రహ్మానందం పూర్తిగా దూరమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: