టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి అంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న మాట వాస్తవం. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే ఈ హీరో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తూ విజయవంతం అయ్యాడు, మెగా ఫాన్స్ తో నాకు సంబంధం లేదు తనకంటూ ప్రత్యేక ఆర్మీ ఉందని మెగా ఫాన్స్ ని ఇబ్బంది పెట్టినా సరే అతను అన్న మాటలో నిజం ఉందని అంటారు టాలీవుడ్ జనం. అతను గతంలో ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంది కూడా తక్కువే అంటారు. ప్రజా రాజ్యం పార్టీ తర్వాత అతను పెద్దగా ఆ ఫ్యామిలీ తో చనువుగా కూడా ఉన్నట్టు లేదు అనేది కొందరి మాట. 

 

చిరంజీవి ఫాలోయింగ్ తనకు అవసరం లేదని కూడా కొందరి ముందు వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ఇక తన తండ్రికి ఉన్న ఇమేజ్ సినీ పరిశ్రమలో తనకు కూడా ఉపయోగపడుతుంది. అతనితో సినిమాలు చేయవద్దు అని చెప్పే ధైర్యం కూడా కొందరికి లేదు. దీనికి తోడు అతను చేసే దర్శకులు కూడా మెగా ఫ్యామిలీ తో అంత టచ్ లో ఉన్న వాళ్ళు కాదు. త్రివిక్రమ్ కి ఉన్నా కేవలం పవన్ తో మాత్రమే ఉంది. దీనితో ఇప్పుడు అతను ఆ ఫ్యామిలీ కి దాదాపుగా దూరం అయ్యాడని అంటున్నారు. నాగబాబు సహా కొందరిపై ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేసాడు. 

 

ఆ వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీ కి ఆగ్రహం కూడా తెప్పించాయి. పవన్ ఫాన్స్ ని తిట్టడం తో వాళ్ళు కూడా అతని సినిమాలు చూడటం దాదాపుగా మానేశారు అనే చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ పవన్ తో కాస్త దగ్గరగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయినా సరే తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు కాబట్టి అతని సినిమాలకు వచ్చిన ఇబ్బంది లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: