టాలీవుడ్ లోకి మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు.  సొంతగా పార్టీ పెట్టి తర్వాత విలీనం చేసి కేంద్ర మంత్రి హోదాలో కొనసాగిన చిరంజీవి పదేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రావాలని కోరిక కలగడం.. ఆయన స్థాయికి తగ్గట్టు తమిళంలో విజయ్ నటించిన ‘కత్తి ’ సూపర్ హిట్ కావడం.. ఆ మూవీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు వివివినాయక్ ‘ఖైదీ నెంబర్ 150’ తెరకెక్కించడం వెంట వెంటనే జరిగిపోయాయి.  ఈ మూవీతో మస్ ఎలిమెంట్స్ తో పాటు ఓ సోషల్ మెసేజ్ కూడా ఉండటంతొో మెగాస్గార్ కి బాగా కలిసి వచ్చింది.  ఈ మూవీ తర్వాత చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  స్వాతంత్ర నేపథ్యంలో వచ్చిన  ఈమూవీ ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. 

 

ప్రస్తుతం చిరంజీవి టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న కొరటాల శివ దర్శకత్వంలో  ఓ మూవీలో నటిస్తున్నారు.  ఈ మూవీ కూడా సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ అని తెలుస్తుంది. ఇందులో దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాలు, మాఫీయాకు నేపథ్యంలో ఉండబోతుందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.  తాజాగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. అంతే కాదు ఈ మూవీలో ఓ కీలక పాత్రలో మహేష్ బాబు కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ముగిసిన త‌ర్వాత 153వ మూవీగా మ‌లయాళ సినిమా `లూసిఫ‌ర్‌`ను రీమేక్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. మాలీవుడ్ లో మోహన్ లాల్ నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  రాజకీయ కోణంలో సాగే ఈ మూవీ రిమేక్ విషయంలో రామ్ చరణ్, చిరు ఇంట్రెస్ట్  చూపడంతో రిమేక్ కి సిద్దమైనట్లు సమాచారం.

 

అయితే చిరంజీవి `లూసిఫ‌ర్‌` రీమేక్ కోసం మ‌రో ద‌ర్శ‌కుడిని వెతికే ప‌నిలో ఉన్నాడ‌ట నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ రీమేక్‌ను వి.వి.వినాయ‌క్ డైరెక్ట్ చేసే అవ‌కాశాలున్నాయ‌ట‌. వివివినాయక్  గతంలో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 లాంటి సూపర్ హిట్స్ అందించిన విషయం తెలిసిందే. అన్నీ అనుకున్న‌ట్లుగా కుదిరితే లూసిఫ‌ర్ రీమేక్‌ను వినాయ‌క్ తెర‌కెక్కిస్తాడ‌ట‌. అయితే ఈ విషయం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వస్తే కానీ క్లారిటీ రావు. 

మరింత సమాచారం తెలుసుకోండి: