టాలీవుడ్ లో ఎప్పుడు హీరోయిన్స్ కొరత ఉంటుంది. యువ హీరోలకే కాదు స్టార్స్ కూడా హీరోయిన్స్ దొరక్క ఇబ్బందులు పడుతుంటరు. వందల కోట్ల బిజినెస్ జరిగే తెలుగు సినిమా పరిశ్రమలో ఐదారుగురు మాత్రమే ఎప్పుడు ఫాం లో ఉంటారు. అయితే స్టార్ హీరోయిన్ గా తాము కూడా మారే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఎంట్రీ ఇస్తుంటారు కొందరు భామలు. అలానే ప్రతివారం రిలీజ్ అయ్యే సినిమాల్లో అయితే హీరో లేదంటే హీరోయిన్ ఇలా ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. 

 

ఫిబ్రవరి నెలలో స్టార్ సినిమాలతో పాటుగా 7 సినిమాలు పూర్తిగా కొత్త హీరో కొత్త హీరోయిన్స్ తో రిలీజ్ అయ్యాయి. వాటిలో రాహు ఒకటి. కృతి గాజ్ ఫీమేల్ లీడ్ గా నటించిన ఈ సినిమా కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది. రక్తం చూస్తే కళ్ళు కనిపించని పాత్రలో నటించి మెప్పించింది కృతి గార్గ్. ఎలాగైనా తన టాలెంట్ చూపించాలని ఎంచుకున్న పాత్రకు పూర్తి న్యాయం చేసింది కృతి గార్గ్. సుబ్బు వేదుల డైరెక్ట్ చేసిన రాహు సినిమాలో కృతి గార్గ్ పర్ఫార్మెస్ బాగుంది. 

 

హెరాల్డ్ ఫిబ్రవరి బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా అమ్మడు కృతి గార్గ్ కు ఈ అవార్డ్ దక్కింది. సినిమాలో ఆఎ పాత్రలో మెప్పించిన తీరు బాగుంది. రాహు సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ కాకున్నా అందులో నటించిన కృతికి మ్మంచి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. సినిమాకు ఇనాస్త ప్రమోషన్స్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఏది ఏమైనా హెరాల్డ్ ఫిబ్రవరి బెస్ట్ డెబ్యూ హీరోయిన్ అవార్డ్ అందుకున్న కృతి గార్గ్ ముందుముందు ఇంకా ఎన్నో మంచి అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదగాలని కోరుకుందాం. రాహు మూవీలో ఆమె నటన స్టార్ డైరక్టర్ దృష్టిలో పడ్డాదా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: