సినిమా హిట్ అవ్వాలంటే మేజర్ గా చెప్పుకునే అంశాలలో మ్యూజిక్ కూడా ఒకటి. స్టార్ సినిమా నుండి యువ హీరోల సినిమాల వరకు మ్యూజిక్ ఎంత బాగుంటే సినిమా ఆడియెన్స్ కు అంత రీచ్ అయినట్టు. రిలీజ్ ముందే సినిమా మీద ఓ పాజిటివ్ బజ్ తెచ్చేందుకు ఉపయోగపడే మ్యూజిక్ సినిమా ఫలితం మీద ప్రభావం చూపిస్తుందని చెప్పడంలో ఎలాంట్ సందేహం లేదు. ఇక ఫిబ్రవరి నెలలో బెస్ట్ ఆల్బం గురించి చెప్పుకునే గోవింద్ వసంత్ మ్యూజిక్ అందించిన జాను, మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించిన భీష్మ సినిమాలు పోటీ పడ్డాయి.  

 

ఈ రెండిటిలో కూడా భీష్మ కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. అందుకు మ్యూజిక్ కూడా మేజర్ రోల్ పోశించింది కాబట్టి భీష్మ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఆల్బం అవార్డ్ ఇవ్వడం జరుగుతుంది. భీష్మ సినిమా బెస్ట్ మ్యూజిక్ అంటే ఆ సినిమాకు మ్యూజిక్ అందించిన మహతి స్వర సాగర్ కు ఈ అవార్డ్ దక్కుతుంది. హెరాల్డ్ బెస్ట్ మ్యూజిక్ ఆల్బం ఫిబ్రవరి అవార్డ్ ను భీష్మ సినిమాకు అందిస్తున్నారు. ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేశారు. 

 

ఈ సినిమాలో సరాసరి, వాటే బ్యూటీ, సింగిల్ యాంతం ఇలా అన్ని పాటకు శ్రోతలను అలరించాయి.. అలరిస్తున్నాయి. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించిన సెకండ్ సినిమా ఇది. మొదటి సినిమా ఛలో కూడా మ్యూజికల్ హిట్ అయ్యింది. తండ్రి లానే తను అందించే మ్యూజిక్ చాలా స్పెషల్ గా ఉండేలా చూసుకుంటున్నాడు మహతి స్వర సాగర్. భీష్మ సినిమా హెరాల్డ్ ఫిబ్రవరి బెస్ట్ ఆల్బం అవార్డ్ అందుకున్నందుకు డైరక్టర్ వెంకీకి, హీరో నితిన్, మ్యూజిక్ డైరక్టర్ మహతి స్వర సాగర్ కు కంగ్రాట్స్ చెబుతూ.. ఇక మీదట కూడా వీరు ఇలాంటి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తుంది ఇండియాహెరాల్డ్.కామ్ టీం. 

మరింత సమాచారం తెలుసుకోండి: