టాలీవుడ్ లో పెళ్లి వార్తలకు కొదవేమీ లేదు. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్ల ప్రేమ కథలు, పెళ్ళిళ్ళ మీద జనం ఎక్కువగా ఫోకస్ పెడుతూ వస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద ఎప్పుడూ ఏదోక వార్తతో సోషల్ మీడియా కూడా ఎక్కువగా హడావుడి చేస్తూ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ వారం టాలీవుడ్ లో ఎక్కువగా పెళ్లి చర్చ జరిగింది మాత్రం ఇద్దరి గురించి. సీనియర్ హీరోయిన్ అనుష్క, హీరో నితిన్ పెళ్లి వార్తలపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. 

 

ఆమె ఎవరో క్రికెటర్ ని చేసుకుంటుంది అని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. అది నిజం కాదని తెలిసింది. ఏకంగా ఇంట్లో ఒప్పుకున్నారని కూడా సోషల్ మీడియా వార్తలు రాసింది మొన్నటి వరకు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు టాలీవుడ్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ ని ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే చర్చలు జరుగుతున్నాయి. ఆయన గతంలో ఒక బాలీవుడ్ రైటర్ ని వివాహం చేసుకుని తర్వాత విడిపోయారు. ఇప్పుడు అనుష్క ని చేసుకునే అవకాశం ఉందని అన్నారు. 

 

ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయని అనుష్క కచ్చితంగా పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని అనుష్క మాత్రం ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్ళే చేసుకుంటా అని చెప్పింది. సినిమాలకు కూడా గుడ్ బై చెప్పే అవకాశం ఉందని కూడా కొందరు మాట్లాడారు. మరి ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటుందో చూడాలి. ఇక నితిన్ పెళ్లి గురించి కూడా వార్తలు ఎక్కువగానే వచ్చాయి. అతనికి ఇప్పటికే నిశ్చితార్ధం కూడా అయిపోయింది. అతని పెళ్లి త్వరలో జరుగుతుంది. ఏది ఎలా ఉన్నా ఈ వారం టాలీవుడ్ మొత్తం అనుష్క పెళ్లి గురించే ఎక్కువగా చర్చించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: