గ్లామర్ ఎంత ఉన్నా.. లక్ ఉంటేనే.. ఆ గ్లామర్ కు అర్థం. వచ్చీ రాగానే హిట్ తో అందరి కళ్లలో పడింది. అడక్కుండానే ఛాన్సులిచ్చి ప్రోత్సహించినా.. సక్సెస్ దక్కలేదు. తనకున్న గ్లామర్ ఏమాత్రం ఉపయోగపడకపోవడంతో సీనియర్ హీరోలను నమ్ముకుంది. వాళ్లు కూడా ఈ అమ్మడిని కాపాడలేకపోయారు. ఇదంతా ఎవరి గురించో కాదు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ గురించి. 

 

ఆర్ ఎక్స్ 100 హిట్ తో పాయల్ క్రేజీ హీరోయిన్ అయిపోయింది. మహేశ్.. ఎన్టీఆర్ లాంటి స్టార్స్ ఈ అమ్మడిని పట్టించుకోకపోయినా.. వెంకటేశ్.. రవితేజ లాంటి సీనియర్స్ ఛాన్స్ ఇచ్చారు. ఈ క్రమంలో.. వెంకీమామలో వెంకటేశ్ తో.. డిస్కోరాజాలో రవితేజాతో జతకట్టింది పాయల్. వెంకీమామ ఏవరేజ్ గా నిలిచినా.. ఈ అమ్మడికి పేరు దక్కలేదు. డిస్కో రాజా అయితే నిరాశపరిచింది. దీంతో ఈ అమ్మడిపై ఫ్లాప్ హీరోయిన్ ముద్రపడింది. 

 

కెరీర్ బిగినింగ్ లోనే.. సీత సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి.. క్రేజ్ పోగొట్టుకుంది పాయల్ రాజ్ పుత్. తన చుట్టూ తిరిగే కథ కావడంతో.. నటించిన చిత్రం ఆర్డిఎక్స్ లవ్ నిరాశనే మిగిల్చింది. ఈ అమ్మడి కెరీర్ లో ఆర్ ఎక్స్ 100 తప్ప మరో హిట్ దక్కలేదు. 

 

తెలుగులో పాయల్ ముద్ర చెరిగిపోయినట్టే కనిపిస్తోంది.  ఈ అమ్మడు ప్రస్తుతం జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో నటిస్తోంది.  మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నా.. ఇవేవీ క్రేజీ ప్రాజెక్ట్స్ కావు.  ఫేస్ లో సీనియర్ ఛాయలు కనిపించడంతో జోడీ బాగుంటుందని.. ఆ మధ్య సీనియర్ హీరోలు ఛాన్సులిచ్చారు.  వెంకీమామ.. డిస్కోరాజా ఫ్లాప్ తో పెద్ద హీరోలు కూడా మొహం చాటేశారు. ఇక యంగ్  హీరోల పక్కన పాయల్ పెద్దదైపోతోంది. ఇలా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కు ఆఫర్స్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 





మరింత సమాచారం తెలుసుకోండి: