ప్రభాస్, నాగ అశ్విన్ కాంబినేషన్ ను మెగాస్టార్ చిరంజీవి సెట్ చేశాడా..? దర్శకుడు నాగ అశ్విన్ కు మెగాస్టార్ ఇచ్చిన సలహా ఏంటి..? ఈ సినిమాతో డైరెక్టర్ నాగ అశ్విన్ పాన్ వరల్డ్ ను టార్గెట్ చేశాడా..? డార్లింగ్ కు డైరెక్ట్ చేసిన ప్రామీస్ ఏంటో తెలుసా..?

 

మహానటి డైరెక్టర్ నాగ అశ్విన్ తో ప్రభాస్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ షాక్ తో పాటు ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. మహానటి లాంటి అద్భుత చిత్రాలతో నాగ అశ్విన్ భారీ కమర్షియల్ హిట్ తో పాటు క్రిటిక్స్ మెప్పు పొందాడు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్తో ఈ యంగ్ డైరెక్టర్ కాంబినేషన్ ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. అయితే ఈ కాంబినేషన్ సెట్ చేయడంలో మెగాస్టార్ హ్యాండ్ ఉన్నట్టు వినిపిస్తోంది. 

 

ఇవన్నీ పక్కనపెడితే ఈ సినిమా ఓ లెవల్ లో ఉంటుందట. ఇది పాన్ ఇండియా కాదనీ.. పాన్ వరల్డ్ మూవీ అంటూ నాగ అశ్విన్ సినిమా స్థాయిని చెప్పకనే చెబుతున్నాడు. ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పిన దర్శకుడు సినిమా ఎవరి ఊహకు అందని స్థాయిలో ఉంటుందని టెంప్ట్ చేస్తున్నాడు. నిర్మాత అశ్వినీదత్ సైతం ఈ సినిమాపై ఎగ్జైట్ అవుతున్నాడు. నిర్మాతగా తన కెరీర్ లో ఇదే అత్యంత భారీ చిత్రమని అంటున్నాడు. చూస్తుంటే నాగ అశ్విన్ బాహుబలికి ఎర్త్ పెట్టే ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది. 

 

అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథను ఆధారంగా చేసుకొని నాగ అశ్విన్ అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించాడు. కీర్తి సురేష్ ను సావిత్రి పాత్రలో ఇనుమడింపజేసి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేశాడు. అచ్చం సావిత్రి హావభావాలు ఉట్టిపడేలా తన నైపుణ్యతను చాటి గ్రేట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇపుడు ఆయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా అనగానే ఎక్స్ పెక్టేషన్స్ పీక్ స్టేజ్ లో ఉన్నాడు. ఆల్ రెడీ హిట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న నాగ అశ్విన్.. ఎలా ఆ చిత్రాన్ని రూపొందిస్తాడో అనే ఉత్కంఠ సగటు ప్రేక్షకుడిలో ఉంది. 

 

జక్కన్న రూపొందించిన బాహుబలితో ప్రభాస్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయాడు. గ్రాఫిక్స్ ను రంగరించి అద్భుతంగా తీర్చిదిద్దిన రాజమౌళి మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. తర్వాత సాహో చిత్రం నిరాశపరిచింది. ఇపుడు నాగ అశ్విన్ ప్రభాస్ తో సినిమా చేస్తుండటంతో.. అందరి దృష్టి ఈ మూవీపైనే పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: