నేచురల్ స్టార్ నాని నిర్మాత‌గాను... టాలీవుడ్‌లో త‌న‌దైన స్టైల్లో త‌క్కువ టైంలోనే క్రేజీ హీరోగా పేరు  తెచ్చుకున్న విశ్వ‌క్ సేన్ కాంబోలో తెర‌కెక్కిన హిట్ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. నాని నిర్మాత‌గా మారి తెర‌కెక్కించిన అ.. సినిమా ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం పొందిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు జాతీయ స్థాయి అవార్డులు కూడా రావ‌డంతో నాని క్రేజ్ బాగా హైప్ అయ్యింది. ఈ సారి నాని `హిట్` సినిమాను చాలా ఛాలెంజింగ్‌గా తీసుకుని మ‌రీ తెర‌కెక్కించారు. నూత‌న ద‌ర్శ‌కుడు డాక్ట‌ర్ శైలేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా అదిరిపోయే క్రైం థ్రిల్ల‌ర్ సినిమాగా ప్రేక్ష‌కుల నుంచి ప్రశంస‌లు తెచ్చుకుంది. విశ్వ‌క్ సేన్‌తో పాటు చిల‌సౌ ఫేం రుహానీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా టేకింగ్ హైలెట్ అయ్యింది. ఏ క్లాస్ సెంట‌ర్ల‌తో పాటు మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లో హిట్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

 

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలుగా సుబ్బు వేదుల దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రాహు’. కాగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేసింది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా విడుద‌లై ప‌ర్వాలేద‌నిపించుకుంది.‘రాహు’ అంటూ వినూత్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్  ఉన్న‌ప్ప‌టికీ ఫ్యూ ఎమోషనల్ సీన్స్ తో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలు ఆకట్టుకున్న‌ప్ప‌టికీ ఈ చిత్రంలో మెయిన్ పాత్ర‌ధారులే బ‌ల‌హీనంగా ఉన్నారు అనిపించింది. 

 

రీతూ వర్మ, దుల్కర్ సల్మాన్,  జంటగా న‌టించిన చిత్రం క‌నులు క‌నుల‌ను దోచాయంటే. ఈ చిత్రం దేసింగ్ పరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కింది. మ‌రి ఈ చిత్రం కూడా ఈ వారం విడుద‌ల‌యింది. లవ్ అండ్ క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరచదు. క్లైమాక్స్ స‌న్నివేశాలు ఇంకా బాగా తీసి ఉంటే బావుండేది అనిపించింది. తమిళంలో ఈ సంక్రాంతికి విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న చిత్రం పటాస్ తెలుగులో లోకల్ బాయ్ గా  విడుదలైంది. ధనుష్ డ్యూయల్ రోల్ చేసిన ఈ చిత్రంలో మెహ్రీన్, స్నేహ హీరోయిన్స్ గా నటించారు. మరి ఈ చిత్రం కథలో పెద్ద‌గా బలం లేకపోవడం వల్ల‌ ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచలేకపోయింది.  తెలంగాణ యాస‌లో త‌న పాట‌ల‌తో అంద‌ర్నీ ఆక‌ట్ట‌కున్న సింగర్ మంగ్లీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘స్వేచ్ఛ’. కేపీఎన్ చౌహాన్ దర్శకత్వంలో ఆంగోత్ రాజునాయక్ ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమా మెసేజ్ పరంగా ఓకే అనిపించుకున్నా.  ఓవరాల్ గా సినిమా  మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో ఈ చిత్రం పూర్తిగా విఫలం అయింద‌నే చెప్పాలి.  మ‌రి ఈ వారం బెస్ట్ ఆప్ష‌న్ల‌లలో మొద‌టి స్థానంలో హిట్ చిత్రం ఉంటే..రెండ‌వ స్థానంలో రాహు కాస్త ప‌ర్లేదు అనిపించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: