టాలీవుడ్ లో ఎక్స్‌పరిమెంట్స్ చేస్తున్న హీరోలు కాస్త తక్కువే. అయితే అలా ఎక్స్‌పరిమెంట్స్ కి ఎప్పుడూ సిద్దంగా ఉండే హీరో  శ్రీవిష్ణు. ఇమేజ్ అన్న చట్రం లో ఇరుక్కోకుండా మనసుకి నచ్చిన కథ కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సస్ అవుతున్నాడు. ముందు నుంచి కొత్త తరహా కథలు, కొత్త తరహా పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తున్న శ్రీ విష్ణు లాస్ట్ సినిమా బ్రోచేవారెవరురా. ఈ సినిమా మంచి సక్సస్ ని అందుకుంది. నివేదా థామస్ నటించిన ఈ సినిమా శ్రీ విష్ణు కి మరో సక్సస్ ని ఇచ్చిందని చెప్పాలి. కమర్షియల్ గా బాగా కలెక్షన్స్ రాబట్టలేకపోయినప్పటికి విమర్శకుల ప్రశంసలు మాత్రం దండిగా దక్కించుకుంది. 

 

అంతే కాదు  శ్రీ విష్ణు నుండి ఒక సినిమా వస్తుందంటే అన్ని రకాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ లోనే వైవిధ్యం, వెటకారం కనిపిస్తోంది. పైగా ఫస్ట్ లుక్ లో శ్రీవిష్ణు గెటప్ కూడా చాలా విభిన్నంగా వుంది. కృష్ణుడి గెటప్ వేసుకుని, గాల్లో తేలేంతగా పరుగెడుతూ వెళ్లడం, చోర అన్న టైటల్ చూస్తుంటే ఈసారి కూడా మాంచి ఫన్ సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాడని అర్థమవుతోంది. 

 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాకు హసిత్ గోలి అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. సునయన ఈ సినిమాలో శ్రీ విష్ణు కి జోడీగా నటిస్తోంది. గతంలో వివేక్ ఆత్రేయ దగ్గర సహాయకుడిగా పనిచేసిన హసత్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. తన శిష్యుడి కోసం వివేక్ ఆత్రేయ కూడా ఈ సినిమా కోసం రచన సహాయ సహకారాలు అందించారట. ఒక వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్  షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఏప్రిల్ వరకు సినిమాని సిద్దం చేసి మే నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. 
   

మరింత సమాచారం తెలుసుకోండి: