కరోనా వైరస్.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80000 మందికి పైగా సోకింది. 30000మంది ఇప్పటి వరకూ సామాన్య ప్రజలు మరణించారు. దీనివల్ల చైనా ఎక్కువగా ప్రభావితమైంది. వాళ్ళు చేసిన తప్పే అయినా దానికి పర్యావసనంగా, ప్రత్యామ్నయంగా కొన్ని గంటలలోనే జాగ్రత్తలు చేపట్టింది. రెండు మూడు రోజుల్లోనే ఆసుపత్రులను తయారు చేసింది. కరోనా అంటే అన్ని దేశాలు వణికి పోతున్నాయి. జనాలు ఎవరితో కలవాలన్నా, ఎవరితో పని చేయాలన్నా హడలి చస్తున్నారు. ఈ కరోనా వైరస్ భారత దేశంలోను ఎక్కువగా ప్రభావితం చూపిస్తోంది. ఇప్పటికే ఇక్కడా చాలా కేసులు నమోదయ్యాయి. కొంతమంది ప్రాణాలు విడిచారు. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కూడా షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా భయపడుతున్న కరోనా వైరస్ మీద చాలా మంది ప్రముఖులు సెలెబ్రెటీలు హీరోలు జోకులు వేయడం చర్చనీయాంశమవుతోంది.

 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ వైరస్ బారిన పడి చనిపోతామా అని వణికి  పోతుంటే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మాత్రం ఈ వైరస్ పై సిల్లీ కామెంట్ చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఓ వ్యక్తి ‘కరోనా వైరస్ వల్ల స్టాక్ మార్కెట్ దారుణంగా పడి పోయిందని.. 2008 ఆర్థికమాంద్యం తర్వాత మళ్లీ ఇంతగా పడిపోయింది లేదు’ అని మాట్లాడాడు. ఇందుకు హీరో నిఖిల్ స్పందించాడు. ‘థ్యాంక్స్ టు కరోనా వైరస్.. స్టాక్స్ కొనుక్కోవడానికి ఇదే సరైన సమయం’ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఈ వ్యాఖ్యలకి స్పందించిన ప్రముఖ జర్నలిస్ట్ హేమంత్ హీరో నిఖిల్ ను ఏకిపారేశాడు. ‘ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి కామెంట్ ఇన్ సెన్సిటివ్ గా ఉంది. చుట్టుపక్కల దేశాల ప్రజలు వైరస్ వల్ల చనిపోతుంటే భయపడి పోతుంటే ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు.. అర్థం చేసుకుంటావని అనుకుంటా ’ అని నిఖిల్ ఏకిపారేశాడు.

 

ఇందుకు నిఖిల్ సమాధానమిస్తూ.. 'మనుషులను ఈ వైరస్ చంపలేదు. ఇంతమంది తాగుతున్నా సిగరెట్ మద్యం చంపుతుందా? ఇలాంటి ఫ్లూలు ఎన్ని వచ్చినా మనల్ని ఏమీ చేయలేవు. మన వ్యాధి నిరోధక శక్తి ఈ వైరస్ ను తట్టుకోగలదు.. ఫ్లూలు వచ్చి పోతుంటాయి' అంటూ తనను తాను సమర్థించుకున్నారు. అయితే ఇది ఇపుడు అందరూ తప్పు పడుతున్నారు. ఒక సినిమా సెలబ్రిటీవి అయుండి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు అంటూ త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నావు సమాజం పట్ల నీకు ఆమాత్రం బాధ్యత లేదా అంటూ అడిగారు. దీంతో నిఖిల్ సైలెంట్ అయిపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: